Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై క‌సి తీర్చేసుకున్నారా? గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై కామెంట్లు

ఈ సంద‌ర్బంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి సంప్ర‌దాయం ప్ర‌కారం.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌సంగించారు. అయితే.. సాధార‌ణంగా ప్ర‌సంగించి ఉంటే.. అది పెద్ద వార్త కాక‌పొవ‌చ్చు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:42 AM GMT
కేసీఆర్‌పై క‌సి తీర్చేసుకున్నారా?  గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై కామెంట్లు
X

తాజాగా తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి సంప్ర‌దాయం ప్ర‌కారం.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌సంగించారు. అయితే.. సాధార‌ణంగా ప్ర‌సంగించి ఉంటే.. అది పెద్ద వార్త కాక‌పొవ‌చ్చు. కానీ, ఆమె తొలి ప‌లుకుల్లోనే గత ప్ర‌భుత్వం తాలూకు వ్య‌వ‌హారాన్ని.. ముఖ్యంగా తాను ప‌డిన వేద‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పుకొచ్చారు. అయితే.. నేరుగా ఆమె ఎక్క‌డా.. వ్యాఖ్యా నించ‌లేదు. కేవ‌లం చిన్న క‌విత‌తో త‌న మ‌న‌సులో మాట‌... కేసీఆర్ పై క‌సిని బ‌ట్ట‌బ‌య‌లు చేసేశారు.

ఏమ‌న్నారంటే...

అధికారమున్నదని హద్దు పద్దు లేక

అన్యాయమార్గాల నార్జింపబూనిన

అచ్చి వచ్చే రోజులంతమైనాయి

అచ్చి వచ్చే రోజులంతమైనాయి! - అని గవర్నర్ త‌మిళిసై త‌న‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్ల నుంచి ఆస‌క్తికర కామెంట్లు వ‌స్తున్నాయి. త‌మిళిసై.. ఆనందంగా ఉన్నార‌ని.. తాను ఊపిరి పీల్చుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని మెజారిటీ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

క‌నిపించ‌ని కేసీఆర్‌..

బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజు.. బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం .. విప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. స‌భ‌కు హాజ‌రు కాలేదు. ఆయ‌న రెస్టు తీసుకుంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు.. బీఆర్ ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏ క్ష‌ణ‌మైనా వారు అసెంబ్లీ జ‌రుగుతున్న‌ప్పుడే.. పార్టీ మారే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.