Begin typing your search above and press return to search.

బీజేపీ పై యుద్ధానికి కమిటీలు

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఎన్డీయేని దెబ్బకొట్టాలన్నది ప్రతిపక్షాల లక్ష్యం. ఇందుకోసం బెంగుళూరు వేదికగా కాంగ్రెస్ నాయకత్వంలో 24 ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. రెండురోజుల సమావేశం సోమవరం మొదలైంది. ఈరోజు అంటే మంగళవారం సాయంత్రానికి భేటీ ముగుస్తుంది.

By:  Tupaki Desk   |   18 July 2023 10:51 AM GMT
బీజేపీ పై యుద్ధానికి కమిటీలు
X

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఎన్డీయేని దెబ్బకొట్టాలన్నది ప్రతిపక్షాల లక్ష్యం. ఇందుకోసం బెంగుళూరు వేదికగా కాంగ్రెస్ నాయకత్వంలో 24 ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. రెండురోజుల సమావేశం సోమవరం మొదలైంది. ఈరోజు అంటే మంగళవారం సాయంత్రానికి భేటీ ముగుస్తుంది. ఈ సమావేశంలో ఎన్డీయేపై పోరాటం చేయటానికి కామన్ మినిమం ప్రోగ్రామ్ (సీఎంపీ)ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపక్షాల నేతలు స్ధూలంగా డిసైడ్ అయ్యారు. ఈ సీఎంపీకి ఒక రూపం ఇవ్వటానికి, కార్యాచరణ రెడీ చేయటానికి ఆరు సబ్ కమిటీలను ఏర్పుటు చేయాలని డిసైడ్ అయ్యింది.

సోమవారం డిసైడ్ చేసిన సీఎంపీకి మంగళవారం సాయంత్రానికి ఒక రూపం రావచ్చని అందరు అనుకుంటున్నారు. అదేమిటంటే ఇపుడున్న యూపీఏ స్ధానంలో 24 పార్టీల కలయిక నేపధ్యంలో కొత్తగా మరో పేరు పెట్టాలన్నది మొదటి నిర్ణయం. అంటే యునైడెట్ ప్రోగ్రెసివ్ అలయన్స్ స్ధానంలో కూటమికి కొత్త పేరు రాబోతోంది. అలాగే ఎన్డీయేని ఎదుర్కోవటానికి ఆందోళనలు, ఉద్యమాలు, వివిధ రాష్ట్రాల్లో అమలు తీరు ఎలాగ ఉండాలి అనే అంశాలను కూడా సబ్ కమిటీలు నిర్ణయిస్తాయట. వీటితో పాటు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ బలమేమిటి ? వివిధ రాష్ట్రాల్లో పోటీచేసేటపుడు ఎన్నిసీట్లకు పోటీచేయాలి.

కూటమిలోని పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయమే చాలా చాలా కీలకమైనది. ఈ విషయాన్ని కూడా సబ్ కమిటీలే డిసైడ్ చేస్తాయని సమాచారం. సబ్ కమిటీల ప్రతిపాదనలు రెడీ అయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షాలన్నీ ఒక సారి సమావేశం అవ్వబోతున్నాయి.

అంటే మూడో సమావేశంలో కూటమి విషయంలో ఒక నిర్ణయం జరగచ్చని సమాచారం. అప్పుడే సీట్ల షేరింగ్ పైన కూడా స్ధూలంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు పదిమాసాల సమయముంది. అయితే నరేంద్రమోడీ సడన్ గా పార్లమెంటును రద్దుచేస్తే అపుడు ఎన్నికలు జరగటానికి పెద్దగా సమయం ఉండకపోవచ్చు. అందుకనే ముందుజాగ్రత్తగా సీట్ల షేరింగ్ అంశాన్ని కూడా సబ్ కమిటిలే చర్చించాలని సోమవారం సమావేశంలో నేతలంతా అనుకున్నారట. మరి సాయంత్రం ఎలాంటి నిర్ణయాలుంటాయో చూడాలి.