కమ్యూనిస్టులకు చంద్రబాబే అలుసా..!
కమ్యూనిస్టులు నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో వారిపై నీలినీడలు ముసురుకున్నా యి.
By: Tupaki Desk | 22 Oct 2024 6:30 AM GMTకమ్యూనిస్టులు నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో వారిపై నీలినీడలు ముసురుకున్నాయి. కూటమి సర్కారుతో చేతులు కలిపారంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి వైసీపీ హయాంలో పెద్దగా కమ్యూనిస్టులు ఉద్యమించింది లేదు. పైగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. మీడియా ముందుకు వచ్చి ఏదో చెప్పేసి వెళ్లిపోయారు. మరి దీనిని బట్టి జగన్ అంటే భయపడ్డారో.. లేక ఉద్యమించేందుకు అవకాశం లేకుండా పోయిందని అనుకున్నారో తెలియదు.
కానీ, ఇసుక విషయంలోనూ.. మద్యం విషయంలోనూ.. వైసీపీ పాలనలో సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నది నిజం. ఇసుక లభించకపోవడంతో వందల మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులు ఎదుర్కొన్నారు. మరికొందరు ఉపాధిలేక..ఈసురోమంటూ.. జీవించారు. ఇక, నాసిరకం మద్యంతో అనేక మంది లివర్‌లు చెడిపోయి.. రోగాలపాలయ్యారు. అదేవిధంగా మరికొందరు చనిపోయారుకూడా. కానీ, ఇంత జరిగినా..ఎక్కడా ఎర్ర జెండా ఎగరలేదు. కమ్యూనిస్టుల నోరు పెగల్లేదు.
కట్ చేస్తే.. ఇప్పుడు కూటమిసర్కారు వచ్చి నాలుగు మాసాలు కూడా కాకముందే కామ్రెడ్లుకన్నెర్ర చేస్తు న్నారు. ఉద్యమాలకు పిలుపునిస్తున్నారు. వచ్చే నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామ ని తాజాగా సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. ఇక, సీపీఎం ఇప్పటికే క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అన్యాయం చేస్తున్నారని, ఇసుక, మద్యంలో దోచుకుంటున్నారని ఉద్యమాలకు పిలిపునిచ్చింది. ఇది తప్పుకాదు. ప్రజల పక్షాన ఎవరో ఒకరు నిలవడం తప్పని చూడలేం.
కానీ, జగన్ హయాంలో కూడా ఇలానే జరిగినప్పుడు అప్పుడు మౌనంగా ఉన్న ఎర్ర జెండాలు ఇప్పుడు లేస్తుండడమే చర్చనీయాంశంగా మారింది. అంటే..చంద్రబాబు అంటే.. కామ్రెడ్లకు అలుసా? జగన్ అంటే భయమా? అనేది చర్చ. నిజానికి ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పుకొనే కామ్రెడ్లు.. రెండు ప్రభుత్వాల విషయంలోనూ ఒకే విధంగా స్పందించాలి. కానీ, అప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు బాబును ప్రశ్నిస్తాం.. అంటే.. అది ఏమేరకు నైతికత అనేది ప్రశ్న. దీనికి ముందు కామ్రెడ్లు సమాధానం చెప్పిన తర్వాతే.. ఉద్యమిస్తే.. ప్రజలు నమ్ముతారు. లేకపోతే.. కమ్యూనిజం.. ప్రక్షపాతంపైనే చర్చ సాగుతుంది.