Begin typing your search above and press return to search.

ఒక్క రూపాయి అంత పని చేసింది... వీడియో వైరల్!

అవును... కమ్యునిటీ హెల్త్ సెంటర్ లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   18 Sep 2024 10:30 AM GMT
ఒక్క రూపాయి అంత పని చేసింది... వీడియో వైరల్!
X

సాధారణంగా వందలు, వేలు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చాలా మంది అధికారుల వ్యవహారం తెరపైకి వస్తుంటున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా తీసుకొవాల్సిన రూపాయి కంటే మరో రూపాయి ఎక్కువ వసూల్ చేశాడనే ఆరోపణలపై ఓ ఉద్యోగిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... కమ్యునిటీ హెల్త్ సెంటర్ లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిపై నిప్పులు చెరిగారు.. ఈ సమయంలో అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ఫైరవుతూ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్, మహారాజ్ గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామ కమ్యునిటీ హెల్త్ సెంటర్ లో సిబ్బంది అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో... సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రేమ్ సాగర్ పటేల్.. స్థానిక గ్రామంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది.

ఇందులో భాగంగా... ఆస్పత్రిలోని ఫార్మసిస్ట్ తన వద్ద నుంచి ఒక రూపాయి అధికంగా వసూల్ చేశాడంటూ ఓ రోగి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఫార్మసిస్ట్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు స్పందించి సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.

ఈ సమయంలో ఒక రూపాయి ఎక్కువగా వసూల్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎమ్మెల్యే నిలదీస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.