డేటింగ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి.. కంపెనీ ఆఫర్
అయితే.. దీని అమలుకు ఓ ఉద్యోగి కారణమయ్యాడంట. డేటింగ్‌కు వెళ్లే టైమ్ తనకు లేదని చెప్పడంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
By: Tupaki Desk | 5 Sep 2024 11:30 PM GMTప్రపంచ దేశాల్లో డేటింగ్ కల్చర్ కామన్‌గా మారిపోయింది. యువతీయువకులు ఒక ఏజ్ వచ్చిందంటే డేటింగ్‌కు చేయడం సంప్రదాయంగా మారిపోయింది. అయితే.. ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగుల సంక్షేమం కోసం వినూత్న ఆలోచన చేసింది. డేటింగుకు వెళ్లాలని మరీ ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది.
ఏ కంపెనీ ఉద్యోగులు అయినా వారు బాగుంటేనే ఆ కంపెనీకి గుడ్ నేమ్ ఫేమ్ వస్తాయి. వారి అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తేనే వారు అంతలా కంఫర్ట్‌గా ఫీలయి కాస్త క్వాలిటీ వర్క్ అందిస్తుంటారు. అయితే.. కార్మిక చట్టాల ప్రకారం సైతం ఉద్యోగులకు మినిమం సదుపాయాలు కల్పించాలని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు పెద్ద పెద్ద కంపెనీల్లో అమలువుతుండగా.. చిన్న చిన్న కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే.. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఓ థాయ్ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది.
ఉద్యోగుల సంక్షేమ ధ్యేయం అని అనుకున్న ఆ థాయ్ కంపెనీ.. పెయిడ్ టిండర్ లీవ్ ఆప్షన్ తీసుకొచ్చింది. వైట్‌లైన్ గ్రూప్ ఈ డిసెంబర్ వరకు టిండర్ గోల్డ్, ప్లాటినమ్ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు ఇస్తోందట. అయితే.. డేటింగ్ తేదీకి వారం ముందు నోటీస్ ఇవ్వాలని సూచించింది. ఉద్యోగులకు సంతోషం ఇవ్వడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఈ ఆలోచన చేసిందట.
అయితే.. దీని అమలుకు ఓ ఉద్యోగి కారణమయ్యాడంట. డేటింగ్‌కు వెళ్లే టైమ్ తనకు లేదని చెప్పడంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముందస్తుగా చెప్తే డేటింగ్‌కు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తోంది. అయితే.. ఈ డేటింగ్‌కు ఎన్నిరోజులు సెలవు ఇస్తున్నారనేది మాత్రం పేర్కొనలేదు. మొత్తానికి కంపెనీ నిర్ణయంతో ఉద్యోగులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారని టాక్.