మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీపై ఆసక్తికర ఫిర్యాదు..!
అయితే.. లీగల్ ఒపీనియన్ అనంతరం నేడు మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 109 ప్రకారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహడి షరీఫ్ పోలీసులు!
By: Tupaki Desk | 12 Dec 2024 10:09 AM GMTమంచు కుటుంబంలోని తగాదాలు రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే. గత నాలుగైదు రోజులుగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఆదివారం చిన్న చిన్న చినుకులుగా మీడియాలో ఊహాగాణాలుగా మొదలైన వ్యవహారం... మంగళవారం రాత్రికి మీడియాపైనా దాడులు, కేసులు, నోటీసులు, ఆస్పత్రిలో చేరికలతో పీక్స్ కి చేరింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.
ఇప్పటికే విష్ణు, మనోజ్ లు ఇద్దరూ సీపీ ముందు హారయ్యారు. దీంతో.. ప్రస్తుతం రాచకొండ సీపీ ఆదేశాల మేరకు అన్నదమ్ములు ఇద్దరూ కాస్త శాంతించారని అంటున్నారు. మరోపక్క మోహన్ బాబు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారని తెలుస్తోంది. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ సమయంలో మంచు ఫ్యామిలీపై మరో కీలక ఫిర్యాదు అందింది.
ఇందులో భాగంగా... ఆదివారం ఉదయం మంచు ఫ్యామిలీకి సంబంధించి గొడవలు మొదలైనట్లు కథనాలొచ్చిన సమయంలో చాలా మందికి వచ్చిన ఒక డౌట్ "ఇది పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉండొచ్చు" అనే సందేహం. అయితే.. అది పబ్లిసిటీ స్టంట్ కాదని.. స్టంట్ విత్ బౌన్సర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ అనే తర్వాత తెలిసిందని సరదా కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు!
ఈ నేపథ్యంలో మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ లపై వెంటనే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ తాజాగా హైకోర్టు అడ్వకేట్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మీడియా ప్రతినిధులను మనోజ్ తన ఇంట్లోకి తీసుకెళ్లడం వల్లే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు.
ఇదే సమయంలో... మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ కోసమే వారు డ్రామా ఆడుతున్నారని.. అందువల్ల మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్ కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారని కథనాలొస్తున్నాయి. దీంతో... ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.
కాగా... జర్నలిస్టులపై దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 118 కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. లీగల్ ఒపీనియన్ అనంతరం నేడు మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 109 ప్రకారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహడి షరీఫ్ పోలీసులు!