Begin typing your search above and press return to search.

రోజాకు షాక్.. రూ.100 కోట్లతో ఆడేసుకున్నారట!

ఆడుదాం ఆంధ్రా పేరుతో జరిగిన ప్రోగ్రాంలో రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సీఐడీకి కంప్లైంట్ చేశారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:30 AM GMT
రోజాకు షాక్.. రూ.100 కోట్లతో ఆడేసుకున్నారట!
X

ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై కొత్త కంప్లైంట్ తెర మీదకు వచ్చింది. ఆడుదాం ఆంధ్రా.. సీఎం కప్ల పేరుతో క్రీడాశాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ సీఐడీకి కంప్లైంట్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆడుదాం ఆంధ్రా పేరుతో జరిగిన ప్రోగ్రాంలో రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సీఐడీకి కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వంలోపని చేసిన శాప్ ఎండీలు.. శాప్ ఉన్నతాధికారులు.. అన్ని జిల్లాల్లోని డీఎస్ డీవోలపైనా విచారణ జరపాలని కోరారు. అంతేకాదు.. స్పోర్ట్సో కోటాలో మెడికల్.. ఇంజినీరింగ్.. ట్రిపుల్ ఐటీ ఆడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వీటిపైనా విచారణ చేయాలని కోరుతున్నారు.

ఈ పరిణామాల్ని చూస్తే.. ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉంటూ.. నాటి విపక్ష నేత చంద్రబాబును.. జనసేనాని పవన్ కల్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆమె తీరుపై తెలుగు తమ్ముళ్లు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో తెలిసిందే. ప్రభుత్వం కొలువు తీరిన రెండు.. మూడురోజులకే సీఐడీకి కంప్లైంట్ చేయటం చూస్తే.. రానున్న రోజుల్లో పలు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.