చిన్నమ్మ ఇంత పనిచేసిందా? అధిష్టానానికి ఫిర్యాదులు?
ఈ క్రమంలో మీడియా ముందుకు రాకుండానే తాము చెప్పాలని అనుకున్న విషయాలను లిఖిత పూర్వకంగా.. అధిష్టానానికి అందించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 22 April 2024 12:30 PM GMTఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై కేంద్ర అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సీట్ల పంపకం.. అభ్యర్థుల ఎంపిక.. వంటివిషయాలపై ఆగ్రహంతో ఉన్న కొందరు కీలక నాయకులు.. చిన్నమ్మ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ముందుకు రాకుండానే తాము చెప్పాలని అనుకున్న విషయాలను లిఖిత పూర్వకంగా.. అధిష్టానానికి అందించారని తెలుస్తోంది. దీనిపై అధిష్టానం కూడా సీరియస్‌గానే ఉందని.. అంటున్నారు.
ఏం జరిగింది?
ప్రస్తుత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో 10 అసెంబ్లీ స్తానాలను, 6 పార్లమెంటు స్థానాలను బీజేపీ తీసుకుంది. ఇది.. బీజేపీ అధిష్టానమే చూసుకుంది. కేంద్రం నుంచి ప్రత్యేకంగా పరిశీలకులను పంపించి.. టికెట్ల షేర్‌పై చర్చలు జరిపింది. అనంతరం.. అభ్యర్థుల విషయాన్ని పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వరికి అప్పగించారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. దీంతో ఆమె ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరేసి చొప్పున అభ్యర్థుల ప్రొఫైల్‌ను పంపించారు.
అయితే.. ఇక్కడే పురందేశ్వరి.. విమర్శల పాలయ్యారు. తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు అనుకూ లంగా నివేదికలు ఇచ్చారని.. ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్నవారిని.. పార్టీలో దశబ్దాలుగా ప్రచారం చేస్తు న్న వారిని విస్మరించారనేది సీనియర్ల వాదన. ఇద్దరు సీనియర్లు ఈ విషయంపై దృష్టి పెట్టి పురందేశ్వరి పంపించిన నివేదికలను సేకరించారు. వీటిలో ఆమె నియోజకవర్గాలకు సంబంధించి రెండో అభ్యర్థి తరఫున పంపించిన అంశాల్లో పేర్కొన్నవి నిజం కాదని.. గెలిచే సత్తా లేదని విశాఖకు చెందిన ఓ కీలక నాయకుడిపై చేసిన వ్యాఖ్య సరికాదని అంటున్నారు.
అంతేకాదు.. పురందేశ్వరి ఎవరితోనూ చర్చించకుండా.. చర్చించినా.. ఆయా పేర్లు పంపించకుండా.. తాను సొంత నిర్ణయాలు తీసుకున్నారనేది.. పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఈ ఫిర్యాదులనే కేంద్ర అధిష్టానానికి పంపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఫారాలు ఇవ్వాలని భావించినా.. కేంద్ర పార్టీ వాటిని తొక్కి పట్టిందని సమాచారం. సోమవారం లేదా.. మంగళవారం.. కేంద్ర పరిశీలకుడిని క్షేత్రస్థాయికి పంపించి.. నిజాలు గుర్తించే పనిలో ఉన్నారని తెలిసింది. ఆ తర్వాతే.. అభ్యర్థులను నిర్ణయించి.. బీ ఫారాలు అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.