Begin typing your search above and press return to search.

అప్పులు చేసే విషయంలో ఆంధ్రుడ్ని కొట్టేవారే లేరంట.. తాజా లెక్కలివిగో!

అయితే ఈ లెక్కలు చెబుతుంది మరెవరో కాదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   12 Oct 2024 1:30 AM GMT
అప్పులు చేసే విషయంలో ఆంధ్రుడ్ని కొట్టేవారే లేరంట.. తాజా లెక్కలివిగో!
X

"కత్తి వాడటం మొదలుపెడితే నా కంటే బాగా ఎవడూ వాడలేడు".. ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది! దీన్ని కాస్త ఆంధ్రుల అప్పుల టాలెంట్ కు అన్వయిస్తే... "అప్పులు చేయడం మొదలుపెడితే ఆంధ్రుడి కంటే బాగా ఎవరూ చేయలేరు!" అని చెప్పుకోవచ్చు. అయితే ఈ లెక్కలు చెబుతుంది మరెవరో కాదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి.

అవును... మరే రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అప్పులబారిలో పడి ఉన్నారని తాజా లెక్కలు తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో 18ఏళ్లు దాటిన జనాభాలో ప్రతీ లక్షమందిలో సగటున 60,093 మందిపై అప్పుల భారం ఉన్నట్లు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఆ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం... దేశంలోని మరే రాష్ట్రంలోనే లేని సగటు అప్పులున్న జనాభాగా ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. ఈ విషయంలో ఏపీకి దరిదాపుల్లో కూడా మరో రాష్ట్రం లేకపోవడం గమనార్హం. ఈ విషయంలో జాతీయ సగటు లక్షమందిలో 18,322 గా ఉంటే... దానికి మూడు రెట్లు ఎక్కువగా ఆంధ్రుల్లో ఉంది.

ఈ సర్వేను 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య నిర్వహించారు. ఈ మేరకు రూ.500 కంటే ఎక్కువ రుణం తీసుకొని, వాటిని తిరిగి చెల్లించని వారందరినీ రుణగ్రహీతలు కింద పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలా ఏపీలో అప్పులు తీసుకున్నవారిలో పట్టణవాసులు కంటే గ్రామీణులే 4.30% అధికంగా ఉన్నారని సర్వే వెల్లడించింది.

ఇక ఇందులోనూ పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళల్లో అప్పులున్నవారు 32.86%, పురుషుల్లో 1.56% మంది ఎక్కువగా ఉన్నారు. ఇక అప్పులున్న పట్టణ మహిళలతో పోలిస్తే.. పురుషులు సంఖ్య 21.69% అధికంగా ఉండగా... గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే 7.49% మహిళలు ఎక్కువగా ఉన్నారు.

దేశంలో ఇలా అప్పుల్లో మహిళ సంఖ్య పురుషులను మించి మరే రాష్ట్రంలోనూ లేదు! ఈ విషయంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాధిలో అప్పులున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు సర్వే చెబుతోంది! ఇందులో భాగంగా ఉత్తరాధి రాష్ట్రాల్లో అప్పులున్నవారి సంఖ్య లక్షలో సగటున 20 వేలకు మించలేదని వెల్లడించింది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వీరి సంఖ్య 11,844 మందే ఉండటం గమనార్హం!

ఇలా ప్రతీ లక్షమందిలో ఎక్కువమందికి అప్పులున్న రాష్ట్రాల జాబితాను పరిశీలిస్తే...

ఆంధ్రప్రదేశ్ - 60,093

తెలంగాణ - 42,407

తమిళనాడు - 35,703

కర్ణాటక - 35,480

కేరళ - 33,859