గాడ్ స్క్రిప్ట్ : ప్రియురాలు, కాబోయే భార్య మధ్య కాన్ఫరెన్స్ కాల్.. షాకింగ్ రిజల్ట్!
పొరపాటున జరిగే కొన్ని పనులు కొంతమందికి జీవితంలో ఊహించని మేలులు చేస్తే.. మరికొంతమంది జీవితాల్లో తేరుకోలేని షాకులు ఇస్తాయని అంటారు.
By: Tupaki Desk | 27 March 2025 10:30 AMపొరపాటున జరిగే కొన్ని పనులు కొంతమందికి జీవితంలో ఊహించని మేలులు చేస్తే.. మరికొంతమంది జీవితాల్లో తేరుకోలేని షాకులు ఇస్తాయని అంటారు. దీన్నే చాలా మంది గాడ్ స్క్రిప్ట్ అని అంటే.. మరికొంతమంది విధి రాత అని చెబుతారు! ఈ క్రమంలో తాజాగా ప్రియురాలు, కాబోయే భార్య మధ్య పొరపాటున కలిసిన కాన్ఫరెన్స్ కాల్.. ఓ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పింది.
అవును... సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఓ వ్యక్తి బారి నుంచి ఓ యువతి జీవితాన్ని కాపాడిందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. తన ప్రియురాలితో మాట్లాడుతున్న సమయంలో.. భార్య చేసిన కాల్ మెర్జ్ అవ్వడంతో వ్యవహారం పీక్స్ కి చేరింది. వారి వివాహం క్యాన్సిల్ అయ్యింది. అతడికి కాబోయే భార్య జీవితం సేఫ్ అయ్యిందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే... ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి.. మరో మండలానికి చెందిన యువతితో సుమారు నెల రోజుల కిందట వివాహం నిశ్చమైంది. ఈ సందర్భంగా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.. రెండు కుటుంబాల వారూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఊహించని పరిణామం జరిగింది.
ఇందులో భాగంగా... ఓ రోజు ఆమె, తనకు కాబోయే భర్తతో మాట్లాడేందుకు సదరు యువతి యత్నించింది. ఈ సమయంలో అతడి ఫోన్ బిజీ వస్తోంది. అప్పటికి అతడు మరో యువతితో ఫోన్ మాట్లాడుతున్నాడు. దీంతో.. ఆమె కాల్ హోల్డ్ లో పెట్టి, కాబోయే భార్య కాల్ లిఫ్ట్ చేసి, బైక్ పై ఉన్నానని.. మళ్లీ కాల్ చేస్తానని చెప్పాడు. అనంతరం ఆ కాల్ కట్ చేయబోయి.. అనుకోకుండా "మెర్జ్" ఆప్షన్ ఆప్షన్ పై ప్రెస్ చేయడంతో.. కాన్ఫరెన్స్ కాల్ యాక్టివేట్ అయ్యింది.
దీంతో.. తనకు కాబోయే భర్త మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి ఆమెకు అర్ధమైపోయింది! వెంటనే.. తాను కాల్ లో ఉన్నానన్న విషయం తెలియకుండా తన భర్త మరో యువతితో మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేసింది. దీంతో.. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దల ముందు ఉంచింది!
దీంతో... వ్యవహారం రెండు కుటుంబాలకు తెలిసింది. ఫలితంగా... మరికొన్ని రోజుల్లో జరగాల్సిన వివాహం రద్దయ్యింది. ఈ సందర్భంగా.. కాబోయే భర్త కుటుంబం తీసుకున్న కట్నం డబ్బులు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఓ కాన్ఫరెన్స్ కాల్ ఓ వివాహం రద్దుకు దారితీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.