Begin typing your search above and press return to search.

నిన్న బన్నీ మామ.. నేడు నితిన్ మేనమామ... స్టార్స్ క్యాపెయినింగ్ మిస్! /

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాస్త జోరు పెంచిన కాంగ్రెస్స్ పార్టీ తొలివిడతగా 55 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా 45 మందితో రెండో జాబితానూ విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 7:59 AM GMT
నిన్న బన్నీ మామ.. నేడు నితిన్  మేనమామ... స్టార్స్  క్యాపెయినింగ్  మిస్! /
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాస్త జోరు పెంచిన కాంగ్రెస్స్ పార్టీ తొలివిడతగా 55 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా 45 మందితో రెండో జాబితానూ విడుదల చేసింది. దీంతో 100 సీట్లను కేటాయించేసే సరికి అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ సమయంలో జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే ఫైరవుతుండగా... తాజాగా నితిన్ మామ నగేష్ రెడ్డి పేరు కూడా రెండో జాబితాలో లేదు.

అవును... టాలీవుడ్‌ హీరో నితిన్‌ మేనమామ నగేష్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న నగేష్‌ రెడ్డి.. నిజామాబాద్‌ రూరల్‌ టికెట్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో... ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించింది. ఇందులో భాగంగా... మరోసారి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో నగేష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.

సుమారు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ.. ఎన్ని ఇబ్బందులు వచ్చిన పక్కచూపులు చూడకుండా నిబద్దత కలిగిన కార్యకర్తగా పనిచేస్తే సరఒమ గుర్తింపు దక్కటం లేదని నగేష్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. దీంతో... ఆయన కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతారా.. లేక, పక్క చూపులు చూస్తారా అనే చర్చ నియోజకవర్గంలో బలంగా మొదలైంది.

ఇక... నగేష్ రెడ్డి పదేళ్లకుపైగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ గా పని చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే టికెట్ హామీ పొందారని అంటున్నారు. ఇదే సమయంలో... నగేష్ రెడ్డికి టికెట్ ఇస్తే, అల్లుడు నితిన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారనే ప్రచారం కూడా బలంగా సాగింది. అదే జరిగితే చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఫ్లస్ అవుందనే విశ్లేషణలూ తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నగేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.

కాగా... బీఆరెస్స్ పార్టీ తరపున హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పోటీలో నిలుస్తారని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నాగార్జున సాగర్ నుంచి ఆయన బరిలోకి దిగుతారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో... తనకు టికెట్ ఇస్తే బన్నీ కూడా ప్రచారం చేస్తారని స్వయంగా చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. కానీ బీఆరెస్స్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌ కే అవకాశం కల్పించింది.

దీంతో అల్లూ అర్జున్ ప్రచారానికి వస్తారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ఈ విషయంపై బన్నీ ఎక్కడా స్పందించలేదు! ఈ క్రమంలోనే తాజాగా సినిమా హీరో నితిన్‌ మేనమామకు కూడా టికెట్ దక్కలేదు. దీంతో... ఈ ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ లేకుండా పోయిందని అభిమానులు హర్ట్ అవుతున్నారంట. అయితే... బీజేపీకి మాత్రం పవన్ కల్యాణ్ ప్రచారం పక్కా అని అంటున్నారు!