కాంగ్రెస్ కు ఎమ్మెల్సీల బొనాంజా.. 6కు పైనే..?
సారి చావోరేవో అన్నట్లు పోరాడి గెలిచింది. దీంతోపాటు సోనియాగాంధీకి కానుక ఇచ్చింది. ఇక ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచింది.
By: Tupaki Desk | 9 Dec 2023 1:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ నూతనోత్తేజం సంతరించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో
సారి చావోరేవో అన్నట్లు పోరాడి గెలిచింది. దీంతోపాటు సోనియాగాంధీకి కానుక ఇచ్చింది. ఇక ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచింది. శనివారం మంత్రులకు శాఖల కేటాయింపు, ఎమ్మెల్యేల ప్రమాణంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరినట్లైంది. ఇకమీదట నామినేటెడ్ పోస్టుల నియామకం కొనసాగనుంది. కొందరు నాయకులకు ఎమ్మెల్సీ పదవులూ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి గెలిచారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి వైదొలగిన కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే అయ్యారు.
ఈ నలుగురూ రాజీనామా..
పల్లా, కడియం, కసిరెడ్డి, కౌశిక్ నలుగురూ ఎమ్మెల్సీ పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. వీరేకాక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకమూ పెండింగ్ లో ఉంది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో పల్లా స్థానిక సంస్థల నుంచి గెలిచారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి 2021 శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేa కోటాలో ఎమ్మెల్సీలు అయ్యారు. వీరికి 2027 నవంబరు వరకు పదవీకాలం ఉంది. డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2015లో తెరాస తరఫున నల్లగొండ, వరంగల్, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2021లో రెండోసారి నెగ్గారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 వరకు ఉంది. కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా తాజాగా ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు.నిబంధనల ప్రకారం 15 రోజులలోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల కమిషన్ ఆరు మాసాలలోపు ఎన్నికలు జరుతుంది. కాగా, మారిన సమీకరణాల నేపథ్యంలో హస్తం పార్టీ వీటిని చేజిక్కించుకునే వీలుంది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలూ కాంగ్రెస్ కే దక్కుతాయి.
ఓడినవారికి మళ్లీ..
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పలువురు పరాజయం పాలయ్యారు. షబ్బీర్ అలీ వంటివారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి వర్గంలోకి తీసుకునే వీలుంది. లేదంటే నాంపల్లి నుంచి ఓడిన ఫిరోజ్ ఖాన్ నూ మండలికి ఎంపిక చేయొచ్చు. ఎలాగూ శాసన సభ్యుల బలం ఉంది కాబట్టి.. ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేకపోయినవారికీ మండలి సభ్యత్వంతో సమాధానపరచవచ్చు. అంతేగాక కాంగ్రెస్ అధికారంలో లేని పదేళ్లూ పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస పార్టీకి ప్రస్తుతం మండలిలో ఒక్కరే సభ్యుడు ఉన్నారు. ఆయన సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇటీవల జగిత్యాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. విశేష అనుభవం ఉన్న జీవన్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ వదులుకోదు.