Begin typing your search above and press return to search.

సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు తరగతులు

కొత్త శాసన సభ కొలువుదీరనుంది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సర్కార్ ప్రమాణస్వీకారం చేయనుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 5:07 AM GMT
సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు తరగతులు
X

కొత్త శాసన సభ కొలువుదీరనుంది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సర్కార్ ప్రమాణస్వీకారం చేయనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితోపాటు మరికొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. దీంతో సీఎంగా రేవంత్ రెడ్డికి మార్గం సుగమం అయింది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యమైన శాఖలకు మంత్రులుగా నియమించేందుకు కొందరిని ఎంపిక చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్తవారున్నారు. దీంతో వారు సభల వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి తరగతులు బోధిస్తున్నారు. డిసెంబర్ 5న వీరు బస చేసిన ఎల్లా హోటల్ లో కొత్త శాసన సభ్యులకు క్లాసులు తీసుకున్నారు. సభలో హుందాగా వ్యవహరించాల్సిన విధానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కొత్తవారు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకుంది. ఈనేపథ్యంలో తెలంగాణ కొత్త సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్నికవుతున్నారు. ఆయనతో పాటు పలువురిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకుని వారికి అవగాహన పెంచుతున్నారు. సభలో అనుసరించాల్సిన విధానాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

రాజ్యాంగపరంగా ఎలా ప్రవర్తించాలనే దానిపై అందరికి సూచనలు చేస్తున్నారు. ప్రతిపక్షాలతో అనుసరించాల్సిన పద్ధతులపై కూడా వివరిస్తున్నారు. శాసనసభలో మొదటి సారి అడుగు పెడుతుండటంతో సభా మర్యాదలు పాటించాలని చెబుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చోటుచేసుకోకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యేలకు తరగతులు నిర్వహిస్తున్నారు. వారిలో ఎలాంటి భయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శాసనసభ్యులు తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వివరిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వారికి శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతగా మేడిపల్లి సత్యం (ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే) వ్యవహరించారు. అలా పలువురి అనుభవాలను జోడించి ఎమ్మెల్యేలకు అభయం ఇస్తున్నారు. అసెంబ్లీలో గౌరవప్రదంగా వ్యవహరించేందుకు సిద్ధం చేస్తున్నారు.