నెలకు 25 వేల పింఛన్... కాంగ్రెస్ దిమ్మతిరిగే హామీ.. మేనిఫెస్టో విడుదల!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ప్రకటించింది.
By: Tupaki Desk | 17 Nov 2023 4:13 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను తాజాగా విడుదల చేశారు. ముఖ్యంగా ఇప్పటికే సోనియా గ్యారెంటీల పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి మేనిఫెస్టోలో మరిన్ని.. పథకాలు ప్రకటించారు.
ఇవీ.. కీలక హామీలు
+ తెలంగాణ అమరవీరులకు పెద్దపీట. వారి కుటుంబంలోని వారికి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం.
+ అమర వీరుల కుటుంబాల్లోని వృద్ధులకు(తల్లి/ తండ్రి) నెలకు 25000 రూపాయల పింఛన్
+ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ తక్షణ అమలు.
+ వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్.
+ ముఖ్యమంత్రి కార్యాలయంలో నేరుగా సీఎం పాల్గొనే ప్రజాదర్బార్ కార్యక్రమం రోజూ నిర్వహణ
+ 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికీ స్కూటీ
+ నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్..
+ నిరుద్యోగులకు ఉపాధికల్పన నిమిత్తం రూ.10 లక్షల మేరకు వడ్డీలేని రుణాలు
+ తొలి ఏడాది(అధికారంలోకి వచ్చిన)లోనే 2 లక్షల శాశ్వత ఉద్యోగాల భర్తీ
+ ఏటా జూన్ 2న జాబ్ క్యాలండర్, ఏటా సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి
+ నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల భృతి
+ యూపీ ఎస్సీ తరహాలో టీపీఎస్సీ నిర్వహణ.
+ వీటికి సోనియా గ్యారెంటీలు అదనంగా అమలు.