Begin typing your search above and press return to search.

టీ.కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్, పీసీసీ చీఫ్ పై కీలక అప్ డేట్!

గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ నియామకంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Aug 2024 11:40 AM GMT
టీ.కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్, పీసీసీ చీఫ్ పై కీలక అప్ డేట్!
X

గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ నియామకంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక మార్పులకు రంగం సిద్ధంపైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... కొత్త పీసీసి చీఫ్ తో పాటు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ను నియమించనుందని అంటున్నారు.

అవును... తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ల విషయంలో ఏఐసీసీ కీలక మార్పులకు సిద్ధమైంది. ఈ హోదాల్లో నియమించేవారి పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... మరో రెండు రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించింది కాంగ్రెస్ పార్టీ.

ఇందులో భాగంగా... మొదటి నుంచీ అంచనా వేస్తున్నట్లుగానే తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరాఇనట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు. దీంతో... పీసీసీ చీఫ్ పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయ్యింది. సీఎంగా రెడ్డి, డిప్యుటీ సీఎంగా ఎస్సీ, ఇప్పుడు పీసీసీ చీఫ్ గా బీసీని నియమించి బ్యాలెన్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదే క్రమంలో... ప్రస్తుతం తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న దీప్ దాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ ను నియమించాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే దీప్ దాస్ మున్షీని.. పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ గా.. కేరళ పీసీసీ చీఫ్ గా కేసీ వేణుగోపాల్ ను నియమించారని సమాచారం. ఆయన స్థానంలో ఏఐసీసీ ప్రధన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ ను నియమించారని తెలుస్తోంది!

కాగా... టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీగా ఉన్న బొమ్మ మహేష్ గౌడ్ పేరు టీపీసీసీ చీఫ్ గా ఖరారైనట్లు తెలుస్తోన్న సంగతి తెలిసిందే. రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చిన సమయం నుంచి పీసీసి చీఫ్ గా, సీఎం అయిన సమయంలోనూ మహేష్ పూర్తిగా సహకరిస్తూ, మద్దతు పలికారని అంటారు. ఈ నేపథ్యంలో... మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటన లాంఛనం అనే అంటున్నారు.