షర్మిల ఘనకార్యం.. కాంగ్రెస్‌లో రచ్చ.. !
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఉన్న షర్మిల.. తాజాగా చెలరేగిన సరస్వతీ పవర్ విషయంలో సొంత అన్న, వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. లేఖ సంధించారు
By: Tupaki Desk | 24 Oct 2024 8:30 AM GMTకాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఉన్న షర్మిల.. తాజాగా చెలరేగిన సరస్వతీ పవర్ విషయంలో సొంత అన్న, వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. లేఖ సంధించారు. అన్నగా.,. ఒక చెల్లిపై చూపించే ప్రేమ ఇదేనా? నీ ప్రేమ నిజమనుకున్నాను.. కానీ, మోసం చేశావు.. అంటూ.. ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. లేఖను సంధించారు. అమ్మ సమక్షంలోనే నువ్వు అగ్రిమెంటు రాశావని.. ఇప్పుడు దానిని తోసిపుచ్చుతు న్నావని.. కాబట్టి, న్యాయపోరాటం తప్పదని కూడా షర్మిల పేర్కొన్నారు.
అయితే.. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. షర్మిల దారిలో షర్మిల వెళ్తున్నారు. అయితే.. ఇక్కడ ఆమె చేసిన ఘన కార్యం.. మొత్తంగా రెండు పార్టీలపై అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి. షర్మిల రాసిన సుదీర్ఘ లేఖ.. `టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్`లో ప్రత్యక్షమైంది. ఇదెలా సాధ్యం? అంటే.. షర్మిలే స్వయంగా టీడీపీకి అందించిందని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి.. షర్మిల.. టీడీపీ మనిషి అనే వాదన నిన్న మొన్నటి వరకు కేవలం చర్చగా ఉండగా.. ఇప్పుడు నిజంగా మారిపోయింది.
అయితే.. ఈ లేఖను విడుదల చేసిన టీడీపీ సోషల్ మీడియా ఎలాంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం. కేవలం షర్మిల లేఖను విడుదల చేసి వదిలేసింది. అయితే.. రేపు దీనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినా చేయొచ్చు. కానీ, జనాలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి.. ఇక, షర్మిల టీడీపీ సర్కారుపై ఎలాంటి విమర్శలు చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. ఆమె ఆ తాను ముక్కేనని తాజాగా ససాక్ష్యంగా తెలిసిపోయింది.
ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో రచ్చగా మారింది. కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి? షర్మిల చేస్తున్నది ఏంటి? అని పార్టీలో నాయకులు ఫైర్ అవుతున్నారు. బీజేపీతో చెలిమి చేస్తున్న టీడీపీతో చేతులు కలపడం ఏంటన్నది సీనియర్ల వాదన. అయితే.. ఎవరూ కూడా బయటకు చెప్పడం లేదు. కానీ, అంతర్గతంగా మాత్రం.. పార్టీ చీఫ్‌పై రుసురుసలాడుతుండడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. షర్మిల ఘన కార్యంపై కాంగ్రెస్ నేతలు చిర్రుబుర్రులాడుతుండడం.. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పేందుకు రెడీ కావడం వంటి చర్చగా మారాయి.