Begin typing your search above and press return to search.

రాహుల్ కు షాక్ తప్పదా ?

గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

By:  Tupaki Desk   |   16 July 2023 5:55 AM GMT
రాహుల్ కు షాక్ తప్పదా ?
X

గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నరేంద్ర మోడీ ఇంటి పేరు మోదీపై సెటైర్లు వేయటం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. 2018 లో కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ మాట్లాడుతూ దేశాన్ని వదిలి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్ళందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకుంది అంటు ఎగతాళిగా మాట్లాడారు. ప్రధానమంత్రిని ఉద్దేశించి తాను సెటైర్లు వేస్తున్నానని రాహుల్ అనుకున్నారు. అప్పట్లో అదే పద్ధతిలో రాహుల్ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

అయితే ప్రధానమంత్రి పైన సెటైర్లు వేస్తున్నానని రాహుల్ అనుకున్నారే కానీ మోడీ అనే ఇంటిపేరు ఉన్న వాళ్ళందరినీ తాను అవమానిస్తున్న గ్రహించలేదు. మోడీ అన్నది ఇంటిపేరు. గుజరాత్ లో మోడీ అనే ఇంటిపేరున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. రాహూల్ వ్యాఖ్యల వల్ల ఏమైందంటే మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా ఆర్ధిక నేరగాళ్ళే అన్నట్లుగా తయారైంది. దాంతో గుజరాత్ లోని మోడీలందరు రాహుల్ పై మండిపోయారు. వెంటనే నిరసన తెలిపారు.

అప్పట్లోనే మోడీ అనే ఇంటి పేరు పై సెటైర్లు వేసినందుకు రాహుల్ క్షమాపణ చెప్పేసుంటే వివాదం అప్పట్లోనే ముగిసిపోయేది. కానీ దాన్ని ప్రిస్టేజి గా తీసుకున్నారు. అందుకనే బీజేపీ ఎంఎల్ఏ పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఎప్పుడైతే రెండేళ్ళ శిక్ష పడింది వెంటనే రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యింది. దాంతో రాహూల్ గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. అయితే హైకోర్టు కూడా సూరత్ కోర్టు శిక్షనే కన్ఫర్మ్ చేసింది. దాంతో ఇపుడు సుప్రీంకోర్టులో కేసు వేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏ కోర్టయినా కింద కోర్టు వేసిన శిక్షను కన్ఫర్మ్ చేసేట్లుగానే ఆలోచిస్తుంది. ఎందుకంటే కేసు విచారణలన్నీ వివిధ కోర్టుల్లో జరిగిపోయిన తర్వాతే శిక్షలు ఖరారవుతాయి కాబట్టి. అయితే కింది స్థాయి కోర్టు తీర్పు పై కోర్టు స్టే ఇచ్చిన సందర్భాలున్నా అవి చాలా తక్కువ. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతు రాహూల్ కు రండేళ్ళు శిక్ష విధించటమే ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవటానికి వీలుగానే రెండేళ్ళు శిక్ష విధించినట్లుగా అనుమానిస్తున్నారు. మరి సుప్రింకోర్టులో ఏమి జరుగుతుందో చూడాలి.