Begin typing your search above and press return to search.

రోహిత్ అంటే 'ఫ్లవర్' కాదు.. ఫైర్.. కాంగ్రెస్ 'షామా'కు బీజేపీ కౌంటర్.. వీడియో

ఆమె రోహిత్ శర్మపై నెగటివ్ కామెంట్లు చేస్తూ అతని ఫిట్‌నెస్ గురించి విమర్శించడం క్రికెట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.

By:  Tupaki Desk   |   10 March 2025 10:52 AM IST
రోహిత్ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. కాంగ్రెస్ షామాకు బీజేపీ కౌంటర్.. వీడియో
X

కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి. ఆమె రోహిత్ శర్మపై నెగటివ్ కామెంట్లు చేస్తూ అతని ఫిట్‌నెస్ గురించి విమర్శించడం క్రికెట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ అంత గొప్ప ఆటగాడు కాదని, మైదానంలో వేగంగా పరుగులు తీయలేడని ఆమె వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రముఖుల నుండి తీవ్ర ప్రతిస్పందనలను తీసుకొచ్చాయి. మాజీ ఆటగాళ్లు షామా మహమ్మద్ పై మండిపడి, ఒక ఆటగాడి ప్రతిభ గురించి ఆమెకు పూర్తిగా అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పారు. కెప్టెన్‌గా ఉండే ఒత్తిడిని అర్థం చేసుకోవాలని, జట్టుకు నాయకత్వం వహించడం ఎంత క్లిష్టమైన పని అని తెలుసుకోవాలని సూచించారు. షామా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఆమె వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాతీయ మీడియా కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. షామా మహమ్మద్ వ్యాఖ్యలను ఆగ్రహంతో వ్యతిరేకిస్తూ, ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం రోహిత్ శర్మను లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయపడింది. ప్రముఖ మీడియా అధినేత అర్ణబ్ గోస్వామి అయితే మరింత తీవ్రంగా స్పందించారు. ఒక లెజెండరీ టీమిండియా కెప్టెన్‌ను విమర్శించడం ఆమె రాజకీయ అజెండాకు సంకేతమని ఆరోపించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో ఈ విధంగా ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.

బిజెపి కూడా ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించింది. నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడం, అందులో రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడటం షామా మహమ్మద్‌కు గట్టి సమాధానంగా మారింది. బిజెపి "పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్" అనే స్టైల్లో "అన్‌ఫిట్ సమ్ జా క్యా? సూపర్ హిట్ హై మై!" అనే క్యాప్షన్‌తో అల్లు అర్జున్ ప్లేసులో రోహిత్ శర్మను పెట్టి ఒక వీడియో రూపొందించి షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ అభిమానులు షామా మహమ్మద్‌పై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.



రోహిత్ శర్మ అభిమానులు కూడా తనపై వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ట్విట్టర్‌లో "కాంగ్రెస్ కా బాప్ రోహిత్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ షామా మహమ్మద్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌తో విమర్శలకు సమాధానం చెప్పాడని, ఆయన ప్రతిభను కించపరిచే హక్కు ఎవరికీ లేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వివాదం రాజకీయ, క్రీడా ప్రపంచంలో విస్తృత చర్చకు దారితీసింది.