Begin typing your search above and press return to search.

జ్యుడీషియల్ కస్టడీలో ఉండి.. దర్జాగా తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 4:52 AM GMT
జ్యుడీషియల్ కస్టడీలో ఉండి.. దర్జాగా తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు
X

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో వెలుగు చూసిన ఉదంతం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. సమల్ఖా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ధరం సింగ్ చోకర్ ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఎన్నికల వేళలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

కారణం.. ఆయన పుత్రరత్నం బరితెగింపే. రూ.400 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసులో ఈ ఏడాది మార్చిలో ధరంసింగ్ కొడుకు అరెస్టు అయ్యారు. అతడ్ని అరెస్టు చేసిన ఈడీ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే.. ఆరోగ్యం బాగోలేదన్న సాకుతో కోర్టు నుంచి అనుమతి తీసుకొని గడిచిన నెల రోజులుగా రోహ్ తక్ లోని పీజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్నారు.

నిబంధనల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతను.. చికిత్స పొందుతున్న వేళలో ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లకూడదన్న రూల్ ఉన్నా.. దాన్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్న భాగోతం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు దుమారంగా మారింది. అనారోగ్యంగా ఉందని ఆసుపత్రిలో చేరి.. దర్జాగా బయట తిరుగుతున్న ఇతడి తీరును ఈడీ అధికారులు గుర్తించారు. ఆరోగ్యం బాగానే ఉన్నా తప్పుడు వాదనలు వినిపించి.. దర్జాగా బయట తిరుగుతున్న వైనంపై ఈడీ అధికారులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు.. తన తండ్రి తరఫు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న వైనాన్ని గుర్తించారు. మరి.. తాజా పరిణామాల నేపథ్యంలో కోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.