కాంగ్రెస్ పిలిచింది.. బీజేపీకి విజయశాంతి గుడ్ బై!?
అయితే.. కీలక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్న సెలబ్రిటీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
By: Tupaki Desk | 4 Nov 2023 5:35 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ లో ఉన్న ఆమెకు గత కొన్నాళ్లుగా తగిన ప్రాధాన్యం లభించని విషయం తెలిసిందే. కీలక నేతలు ఎవరూ కూడా రాములమ్మను పట్టించుకోవడం లేదు. ఇక, తాజా ఎన్నికల నేపథ్యంలోనూ విజయశాంతి పరిస్థితి బీజేపీలో అనిశ్చితిగా మారింది దీంతో పార్టీ నుంచి బయటకు రావాలని ఎప్పటి నుంచో విజయశాంతి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నుంచి ఆమెకు పిలుపు వచ్చినట్టు తెలిసింది. పార్టీలో ప్రాధాన్యంతోపాటు.. తగిన పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానాన్ని కూడా ఆమెకు రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విజయశాంతి బీజేపీకి రిజైన్ చేసేందుకు రెడీ అయ్యారు. శనివారం లేదా.. సోమవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే.. కీలక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్న సెలబ్రిటీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీపై ప్రభావం పడుతుందని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి.. సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాత.. బీఆర్ ఎస్ పంచన చేరారు. ఈ క్రమంలోనే ఎంపీ అయ్యారు.
ఆ తర్వాత.. కేసీఆర్‌తో పొసగకెపోవడంతో బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ కూడా ఆమె దూకుడుతో వెనుకబడ్డారు. ఈ క్రమంలోనే ఆమె మరో పార్టీ బీజేపీలో చేరారు. అయితే..సొంత నేతలపైనేవిమర్శలు గుప్పించడం.. అవినీతి చేస్తున్నారని విమర్శలు చేయడం వంటివి విజయశాంతికి మైనస్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నాయకులు ఒక్కొక్కరుగా ఆమెకు దూరమ య్యారు. ఈ పరిణామాలతో అధిష్టానం కూడా ఆమెను పక్కన పెట్టింది. ఇక, అప్పటి నుంచి పార్టీ మార్పునకు ఆమె ప్రయత్నిస్తుండగా.. తాజాగా రేవంత్‌రెడ్డి వ్యూహంతో అధిష్టానం నుంచి కబురు వచ్చింది. దీంతో బీజేపీ గూటిని వదిలి విజయశాంతి.. కాంగ్రెస్ పంచన చేరనున్నారు.