Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కాంగ్రెస్ కు తొలి 'అధికారిక' ఎమ్మెల్యే

ఇది పాక్షికంగానే సాకారం అయినా.. మళ్లీ ఇప్పుడు టీడీపీ గెలుపుతో అమరావతి ఏకైక రాజధానిగా మారిపోయింది. ఇది వేరే సంగతి..

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:58 AM GMT
హైదరాబాద్ లో కాంగ్రెస్ కు తొలి అధికారిక ఎమ్మెల్యే
X

రాజధాని అంటే ఏ రాష్ట్రానికైనా గుండెకాయ. అంతెందుకు..? ఉమ్మడి ఏపీ విడిపోయేటపుడు హైదరాబాద్ గురించి ఎంతటి రాద్ధాంతం జరిగిందో అందరూ చూశారు. చివరకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాల్సి వచ్చింది. ఇక ఏపీలో 2019లో వైసీపీ గెలుపొందిన అనంతరం జగన్ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది. ఇది పాక్షికంగానే సాకారం అయినా.. మళ్లీ ఇప్పుడు టీడీపీ గెలుపుతో అమరావతి ఏకైక రాజధానిగా మారిపోయింది. ఇది వేరే సంగతి..

ఒక్క ఎమ్మెల్యే అయినా లేకుండా..

ఏడు నెలల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 సీట్లు నెగ్గింది. మిత్రపక్షం సీపీఐ గెలిచిన స్థానంతో కలిపితే 65. అయితే, సాధారణ మెజారిటీ ఇది కేవలం 5 సీట్లే ఎక్కువ. అయితే 64 సీట్లలోనూ కోర్ హైదరాబాద్ లో ఒక్కటీ లేదు. ఇది చాలా ఆశ్చర్యకర విషయమే. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని మొత్తం 24 సీట్లలో బీఆర్ఎస్ 16, మజ్లిస్ 7, బీజేపీ 1, కాంగ్రెస్ 1 గెలిచాయి.

ఒకరు జంప్..

ఫలితాలం అనంతరం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అలా.. హైదరాబాద్ లో కాంగ్రెస్ అనధికారికంగా ఖాతా తెరిచినట్లయింది. అయితే, అధికారికంగా మాత్రం ఇటీవలే ఓ ఎమ్మెల్యే జమ అయ్యారు.

ఖాతాలోకి కంటోన్మెంట్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గడ్డం లాస్యనందిత అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. లోక్ సభ ఎన్నికలతో పాటే జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 13 వేలకు పైగా మెజార్టీతో గెలుపు బావుటా ఎగురవేశారు. అసెంబ్లీలో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ కు ఇది సీటు. అంతేగాక మొత్తం బలం 65కి చేరింది. బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది.