Begin typing your search above and press return to search.

రేవంత్ విషయంలో కాంగ్రెస్ ఆ డేరింగ్ స్టెప్ తీసుకుని ఉంటే...?

తెలంగాణా సీఎం అభ్యర్థిని తేల్చేసి రేవంత్ రెడ్డి విషయంలో డేరింగ్ స్టెప్ వేసిన కాంగ్రెస్ ఆ స్టెప్ ఏదో ముందే వేసి ఉంటే కాంగ్రెస్ కి అదిరిపోయే రిజల్ట్ ని జనాలు ఇచ్చేవారు అని పీకే అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:41 PM GMT
రేవంత్ విషయంలో కాంగ్రెస్ ఆ డేరింగ్ స్టెప్ తీసుకుని ఉంటే...?
X

కాంగ్రెస్ పార్టీ ఇపుడిపుడే మారుతోంది. పాత ట్రెడిషన్స్ కి పాతర వేస్తోంది. కొత్త పోకడలను అనుసరిస్తూ అప్టూ డేట్ అవుతోంది. అయితే ఇది చాలదు. ఇంకా చాలా కావాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రత్యర్ధి పార్టీల సీఎంలు కళ్ళ ముందు ఉన్న చోట వేరేగా స్ట్రాటజీని అనుసరించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం అక్కడ తప్పులో కాలేసింది.

ఫలితం తెలంగాణా లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సింపుల్ మెజారిటీనే జనాలు కట్టబెట్టారు. అదే సీఎం అభ్యర్ధిగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటించి ఉంటే కాంగ్రెస్ మొత్తం స్వీప్ చేసి ఉండేది అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. అదే మాటను రాజకీయ వ్యూహకర్తగా తలపండిన ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పేకే కూడా చెప్పడం విశేషం.

కాంగ్రెస్ కి ఇలా అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కి ఎంతమంది ముఖ్యమంత్రి అభ్యర్ధులు అంటూ చేసిన నెగిటివ్ ప్రచారంలో జనాల్లో కొంత గందరగోళం ఏర్పడింది అని ఆయన అంటున్నారు. ఇక కొంతమంది కాంగ్రెస్ నాయకులు తామూ సీఎం రేసులో ఉన్నామని చెప్పడానికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని అన్నారు.

నిజంగా ఎన్నికల తరువాత జస్ట్ రెండు రోజుల వ్యవధిలో తెలంగాణా సీఎం అభ్యర్థిని తేల్చేసి రేవంత్ రెడ్డి విషయంలో డేరింగ్ స్టెప్ వేసిన కాంగ్రెస్ ఆ స్టెప్ ఏదో ముందే వేసి ఉంటే కాంగ్రెస్ కి అదిరిపోయే రిజల్ట్ ని జనాలు ఇచ్చేవారు అని పీకే అంటున్నారు. నిజానికి ఇది నిజం అన్న భావన ఉంది. ఏకపక్షం విజయం దక్కాల్సిన చోట కాంగ్రెస్ నసుగుడు వైఖరితో చాలానే పోగొట్టుకుంది అని అంటున్నారు

ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మీద జనాలలో ఉన్న పెద్ద ఎత్తున వ్యతిరేకతను గుర్తించడంలో కాంగ్రెస్ బీజేపీ కూడా విఫలం చెందాయని పీకే మరో మాట చెప్పారు. ఎంతసేపూ కేసీఆర్ వ్యూహాలు ఆయన చాణక్య రాజకీయం ఆయన ఎత్తులు పై ఎత్తుల విషయంలో ఎక్కువగా ఆలోచించిన ఈ రెండు పార్టీలూ జనం గుండెలలో బీఆర్ఎస్ మీద ఉన్న పూర్తి వ్యతిరేకతను గుర్తించలేకపోయాయని ఆయన అంటున్నారు.

దాని ఫలితంగానే బీఆర్ ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే చాన్స్ కోరి ఇచ్చారు అన్నది కూడా ఒక కఠినమైన విశ్లేషణగా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఒడుపుగా తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ చూపించిన రాజకీయం తెలంగాణాలో కాంగ్రెస్ చూపించలేకపోయింది అని ఆయన అంటున్నారు.

అంతే కాదు మధ్యప్రదేశ్ లో అప్రతిహతంగా అధికారంలో ఉంటూ కూడా బీజేపీ పెద్దగా వ్యతిరేకతను లేకుండా మరోసారి అద్భుత విజయాన్ని అందుకోవడం ఒక పొలిటికల్ టాలెంట్ అని ఆయన అన్నారు. దానికి కారణం మధ్యప్రదేశ్ పాలిటిక్స్ ని అధికార పార్టీలో వ్యతిరేకత జనాలకు చేరకుండా డా ఎప్పటికపుడు మోడీ చేసిన క్లోజ్ మోనిటరింగ్ అని ఆయన విశ్లేషించారు

ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి అనే ఆయుధం చేతిలో ఉండి కూడా కాంగ్రెస్ ఎందుకు ఈ తప్పు చేసింది అన్న ప్రశ్న తలెత్తుతోంది. పీకే విశ్లెషణలో చెప్పాలీ అంటే కాంగ్రెస్ కనుక రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ఉంటే ఈజీగా వంద సీట్లను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించేది అని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ తన మనసులో రేవంత్ రెడ్డి సీఎం అని అనుకుని జనాలకు మాత్రం చెప్పలేకపోయింది. మరి ఈ బలహీనతలను అధిగమించకపోతే కాంగ్రెస్ కి ఫ్యూచర్ లోనూ ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రచారం చేయబట్టే కాంగ్రెస్ నిలిచి గెలిచింది అన్నది ఆయన ప్రత్యర్ధులు కూడా అంగీకరించే వాస్తవం.