వీహెచ్ వీరావేశం... కాంగ్రెస్ కి అసలుకే మోసం...!
అయితే ఆయనకు కాకుండా వేరే వారికి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఫార్స్ చేశారని వీ హనుమంతరావు ఆవేశంతో ఊగిపోతున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2023 4:16 AM GMTకాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత వీ హనుమంతరావు. ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితమే ఆయన ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. మంత్రిగా కూడా చేశారు. అనేక కీలక పదవులు నిర్వహించారు. వీ హెచ్ కి ముఖ్యమంత్రి పదవి మీద మోజు ఉంది. ఏడున్నర పదుల వయసులో ఉన్న వీ హెచ్ కి ఆ కోరిక తీరుతుందో లేదో తెలియదు.
ఆయన అంబర్ పేట నుంచి గతంలో గెలిచారు. ఆ తరువాత 2014లో పోటీ చేస్తే 16 వేల ఓట్లు వచ్చాయి. ఫోర్త్ ప్లేస్ లోకి వెళ్లారు. 2018లో హనుమంతరావు అంబర్ పేట నుంచి పోటీ చేయలేదు. ఇక తాజా ఎన్నికల్లో తన తరఫున ఒక అభ్యర్దిని ఆయన సిఫార్స్ చేశారు
అయితే ఆయనకు కాకుండా వేరే వారికి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఫార్స్ చేశారని వీ హనుమంతరావు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇక్కడ వి. హనుమంతరావు లక్ష్మణ్ యాదవ్ పేరును సిఫార్సు చేశారు. అయితే ఉత్తం కుమార్ రెడ్డి వేరే వారి పేరుని ప్రతిపాదించారని వీ హెచ్ మండిపోతున్నారు.
ఉత్తమ్ ఎవరు అంబర్ పేట సీటులో జోక్యం చేసుకోవడానికి అని అంటూ ఆయన ఏకంగా గాంధీభవన్ లోనే మీటింగ్ పెట్టి మరీ నిప్పులు చెరిగారు. ఉత్తమ్ కుమార్ గుట్టు బయటపెడతాను అని వార్నింగ్ ఇచ్చేశారు. నా అంబర్ పేట జోలికి రావడం ఎందుకు అని నిలదీస్తున్నారు.
అంబర్ పేటలో బలం ఎవరికి ఎక్కువ ఉందో తేల్చుకుందామని కూడా అంటున్నారు. ఉత్తమ్ ఇంట్లో రెండు టికెట్లు ఉండొచ్చా. ఒక సీనియర్ నేతగా నేను ఒకరి పేరు సిఫార్స్ చేస్తే టికెట్ ఇవ్వరా ఏమిటి ఈ రాజకీయం అని వీ హెచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ్ ప్రతిపాదించిన వ్యక్తి తన మీద ఎస్సె ఎస్టీ కేసు పెట్టిన వారు అని అలాంటి వ్యక్తిని ముందుకు తేవడంతో ఉత్తం కుమార్ రెడ్డి ఆంతర్యం ఏమిటి అని వీ హెచ్ ప్రశ్నిస్తున్నారు. బీసీలను అన్యాయం చేస్తారా అలా అయితే కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వస్తుందని ఆయన ప్రశ్నించడం హాట్ టాపిక్ గా ఉంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఒక్కటే జాబితా ప్రకటించింది. రెండవ జాబితా ప్రకటించలేదు. అయితే ఆ జాబితలోని పేర్లు అనఫిషియల్ గా బయటకు వచ్చాయి. దాంతో తన మనుషులకు టికెట్ రాలేదని బాధతో వీ హెచ్ ఏకంగా మీడియా ముందుకే వచ్చేశారు. ఆయన ఉత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి ని టార్గెట్ చేసుకున్నా ఆయన మాటలు ఆయన జోరు చూస్తే తప్పకుండా కాంగ్రెస్ కే చివరికి చేటు తెస్తుందని అంటున్నారు.
ప్రస్తుతానికి వీ హెచ్ వార్నింగ్ ఇస్తూ బయటపడ్డారు. రెండవ జాబితా పూర్తిగా వస్తే ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ కి రెండు ఎన్నికల తరువాత ఇపుడే విజయానికి కొంత భరోసా దక్కుతోంది. ఈ కీలక సమయంలో వీ హెచ్ లాంటి సీనియర్లు ఇలా వీధిన పడితే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. అయినా వీ హెచ్ ఆవేశం ఆగేలా కనబడడం లేదు,నిన్న పొన్నాల కాంగ్రెస్ ని విమర్శించి రాజీనామా చేసి వెళ్ళారు, ఇపుడు నేనేంటో చూపిస్తాను అని వీ హెచ్ అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటనలో జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు కధ ముందుంటుంది అంటున్నారు.