తెలంగాణాలో కాంగ్రెస్ కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుందా...?
ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాంగ్రెస్ కి ఈసారి దక్కబోతోందా అన్నదే అందరి మదిలో మెదిలో విషయంగా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే 2018 ఎన్నికల్లో ఆనాటి టీయారెస్ కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది.
By: Tupaki Desk | 22 Nov 2023 12:25 PM GMTకాంగ్రెస్ ఊపు చూస్తే గెలుపు ఖాయం అని అంటున్నారు. ఇక అనేక సర్వేలు సైతం ఈసారి కాంగ్రెస్ దే అని బల్లగుద్దుతున్నాయి. రాజకీయ వాతావరణం కూడా అలాగే ఉంది. మొత్తంగా చూస్తే రెండు పర్యాయాలు ఓడిన తరువాత తెలంగాణా రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ జెండా పాతుతుంది అని అంతా నమ్ముతున్న సీన్ ఉంది. ఇక అధికార బీయారెస్ నేతలు కాంగ్రెస్ మీద అదే పనిగా చేసున్న విమర్శలు కూడా ఇదే నిజం అనిపిస్తున్నాయి అంటున్నారు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ విజయం తధ్యం కానీ అది ఎంతటి విజయం అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాంగ్రెస్ కి ఈసారి దక్కబోతోందా అన్నదే అందరి మదిలో మెదిలో విషయంగా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే 2018 ఎన్నికల్లో ఆనాటి టీయారెస్ కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది.
ఆ తరువాత చూస్తే 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కింది. ఇక కేంద్రంలో చూసుకుంటే బీజేపీకి మోడీకి కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది. మరిపుడు 2023లో తెలంగాణాలో కాంగ్రెస్ కి కూడా ఆ రాజయోగం పడుతుందా అన్నదే చర్చగా ఉంది మరి.
దానికి కారణం తెలంగాణాలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారడమే. కొద్ది నెలల క్రితం వరకూ రేసులోనూ ఊసులోనూ లేని కాంగ్రెస్ ఉన్నట్లుండి హనుమంతుడి అవతారం ఎత్తేసింది. అది అంతకంతకు పెరిగిపోతోంది. అంతే కాదు కాంగ్రెస్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది అని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ గెలుపు ఆశలు సింపుల్ మెజారిటీని దాటి మరీ అంచనాలు ఇపుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా పరుగులు తీస్తున్నాయి.
అంటే నాలుగింట మూడొంతులకు పైగా సీట్లు ఈసారి హస్తం పార్టీకి దక్కుతాయని అంతా భావిస్తున్నారు. నిజంగా ప్రచార పటాటోపాలు అధిక పబ్లిసిటీలు ఎందుకు ప్రజాభిప్రాయం కనుక కచ్చితంగా మారితే మాత్రం ఏవీ ఏమీ చేయలేవు అని అంటున్నారు. జస్ట్ మౌత్ టాక్ చాలు ఏ పార్టీకైనా అద్భుతమైన విజయాలను అందించడానికి అని అంటున్నారు.
ఇపుడు కాంగ్రెస్ కి అదే జరుగుతోంది. ఈసారి కాంగ్రెస్ ని ఎన్నుకోవాలని జనాలు డిసైడ్ అయిన నేపధ్యంలో కచ్చితంగా అదే ప్రచారంగా మారిపోతోంది. అతి పెద్ద ప్రభజంగానూ మారి కాంగ్రెస్ గాలి కాస్తా సునామీగా రూపాంతరం చెందుతోంది అని అంటున్నారు. ఈ గాలి ముందు గోల ముందు మరే ప్రత్యర్ధి పార్టీ నిలబడలేక కాంగ్రెస్ ని నిలువరించలేక చతికిలపడిపోవడం ఖాయం అనే అంటున్నారు.
ఇక్కడ మరో మాట కూడా ఉంది. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రభువులు. వారు కడు ధర్మాత్ములు. ఎలా అంటే వారికి అన్నీ తెలుసు. ఎపుడు ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలో కూడా బాగా తెలుసు. ప్రజా తీర్పుని మించిన బ్రహాస్త్రం కూడా లేదు. సగటు భారతీయ ఓటరు తెలివి కూడా అదే. దానికి ఎంత చదువుకున్నా ఎంత అభివృద్ధి చెందిన దేశం ఓటరు అయినా సరితూగడు కూడా.
అందుకే న్యాయంగా తెలంగాణా కోసం కొట్లాడిన బీయారెస్ కి రెండు సార్లు అవకాశం ఇచ్చారు. అదే కేంద్రంలో నాడు అధికారంలో ఉంటూ యూపీఏకి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కి ఈసారి చాన్స్ ఇవ్వాలని జనాలు ధర్మబద్ధంగాఎన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఆ ఒక్క చాన్సే హస్త రేఖలను పూర్తిగా మార్చేస్తోంది అని అంటున్నారు. అంతే కాదు కాంగ్రెస్ కి తెలంగాణా రెడ్ కార్పెట్ పరచి మరీ మీదే సింహాసనం అని తప్పక చెబుతుందన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఇవన్నీ చూస్తూంటే మాత్రం అద్భుతం ఏదో ఈ నెల 30న జరగబోతోంది అని అంచనా కడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. నిశ్శబ్ద విప్లవం కాస్తా ఇపుడు అనుకూల శబ్దంగా కాంగ్రెస్ కి మారిపోతోంది అని అంటున్నారు. ప్రజలు ఎపుడూ ఒక నిర్ణయానికి రావడానికి మాత్రం కొంత ఆలోచన చేస్తారు. ఒక్కసారి కానీ మార్పు కోరుకుంటే మాత్రం తమ కళ్ల ముందు నిలువెత్తు బంగారం ఉంచినా కూడా వారు చలించరు అన్నది గత చరిత్రలో ఎన్నో ఎన్నికలు నిరూపించాయి. మరి తెలంగాణా ప్రజలు డిసైడ్ అయినట్లు అయితే మాత్రం కాంగ్రెస్ కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తధ్యం అని అంటున్నారు.