కాంగ్రెస్ పోల్ మానేజ్మెంట్ కోసం స్పెషల్ టీమ్స్ ని దించిందా!
రాబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కాంగ్రెస్ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే 25 నియోజకవర్గాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిందట.
By: Tupaki Desk | 15 Nov 2023 9:30 AM GMTరాబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కాంగ్రెస్ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే 25 నియోజకవర్గాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిందట. కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో 25 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తో హస్తంపార్టీ అభ్యర్ధులకు టఫ్ ఫైట్ నడుస్తోందనే రిపోర్టు వచ్చిందట. దీంతో ఈ నియోజకవర్గాలపై కాస్త దృష్టి పెడితే అన్నీ స్థానాలు లేకపోతే కనీసం మెజారిటీ స్ధానాలైనా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలిందట.
ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనే ఈ 25 నియోజకవర్గాలున్నాయని సర్వేలో తేలిందట. ఇందుకోసం ఏఐసీసీ సూచనల ప్రకారం ప్రత్యేకంగా స్ట్రాటజిస్టులు రంగంలోకి దిగినట్లు పార్టీవర్గాల టాక్. స్ధానికంగా ఉండే సోషల్ మీడియా టీములు, టీపీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నేతలతో కలిసి స్ట్రాటజిస్టులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. 30వ తేదీన పోలింగ్ ముగిసేవరకు ఆ ప్రత్యేక స్ట్రాటజిస్టులు పై ఉమ్మడి జిల్లాల్లోని నియోజకవర్గాల్లోనే క్యాంపు వేయబోతున్నారు.
స్ట్రాటజిస్టుల బృందంలోని ముఖ్యులు అభ్యర్ధులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటు ప్రతిరోజు వ్యూహాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటారు. ప్రచారం కూడా సొంత అభ్యర్ధులను హైలైట్ చేసుకుంటు ప్రత్యర్ధి అభ్యర్ధుల తప్పొప్పులను బాగా హైలైట్ చేయటమే స్ట్రాటజిస్టుల ముఖ్య ఉద్దేశ్యం. ప్రచారంతో పాటు చివరలో పోల్ మేనేజ్మెంట్ దాకా జాగ్రత్తగా వ్యూహం ప్రకారమే ఎన్నికల ప్రక్రియను చేసుకుంటే గెలుపు తేలికవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అంచనా వేసుకుంటున్నారు. పోలింగ్ రోజున ఉదయం నుండి ఓటర్లను దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకు వెళ్ళటంలోనే పార్టీ గెలుపోటములు ఎక్కువగా ఆధారపడుటుంది.
దీన్నే పోల్ మేనేజ్మెంట్ అని అంటుంటారు. ప్రచారం ముగిసిన రోజు నుండి రెండురోజుల గ్యాప్ లో పోలింగ్ జరిగేంత వరకు ప్రతి పార్టీకి చాలా ముఖ్యమైన సమయం. ఈ రెండురోజుల గ్యాప్ లోనే ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం, డబ్బు, విలువైన తాయిలాల పంపిణీ లాంటి అనేక అంశాలు చాపకింద నీరులాగ పూర్తయిపోతాయి. ఇక్కడే స్ట్రాటజిస్టుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.