Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో ప్రతీ ఎమ్మెల్యే సీఎం అభ్యర్థే... కోమటిరెడ్డి నోట "డబ్బు"ల మాట!

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Oct 2023 9:27 AM GMT
కాంగ్రెస్ లో ప్రతీ ఎమ్మెల్యే సీఎం అభ్యర్థే... కోమటిరెడ్డి నోట డబ్బుల మాట!
X

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ప్రచారంలో కూడా దూకుడు కొనసాగిస్తోంది. ఒక పక్క మొన్నటికి మొన్న రాహుల్ గాంధీతో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం ని ప్రచారానికి దింపింది. ఈ సందర్హంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా కోమటి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

అవును... కర్ణాటకలో ఆధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. మంత్రి కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణలో ప్రచారానికి వచ్చిన కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. కేటీఆర్, మంత్రులు కర్ణాటకకు వస్తే బస్సులో తిప్పి క్షేత్రస్థాయి అభివృద్ధిని చూపిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా... తెలంగాణలో చాలా మంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అంటున్నారని శివకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే విషయాన్ని నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ప్రస్థావించగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఎమ్మెల్యే.. సీఎం అభ్యర్థే అని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్ ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా మరింత క్లారిటీగా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తమకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని.. కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రే అని అన్నారు. అనంతరం తనపై ఎలాంటి అవినీతి మరకలూ లేవన్నట్లుగా స్పందించిన ఆయన... ఎవరైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు తీసుకున్నాడని చూపిస్తే సెంటర్ లో ఆత్మబలిదానం చేసుకుంటానని తెలిపారు!

ఈ సందర్భంగా డబ్బులు తీసుకున్నాడని తన గురించి ఎవరూ చెప్పరు.. అధిష్టాణం చెప్పినట్లు చేశాను.. తెలంగాణ ప్రజల బలిదానాలు ఆగడం కోసం మంత్రి పదవికి రాజినామా చేశానని గుర్తుచేయడం ఆసక్తి కరంగా మారిందని... ఫలితంగా ఆయన చెప్పాలనుకున్న సమాధానం చెప్పినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అనంతరం... రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీలా వస్తోందని చెప్పిన వెంకటరెడ్డి... కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇదే సమయంలో... తెలంగాణలో 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అన్నారు. ఇక, కర్నాటకలో కాంగ్రెస్ పాలనపై హరీష్‌ రావు, కేటీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా... కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు అమలు కాలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు.