1951 నుండి కాంగ్రెస్ ఎంపీ సీట్స్!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2024 6:44 AM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, 400 సీట్లు ఇస్తే అద్భుతాలు చెస్తామని బీజేపీ చెబుతుంటే... బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చబడుతుంది, రిజర్వేషన్స్ తొలగించబడతాయి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చెరుకుంటున్నాయి.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో అత్యంత సీనియారిటీ ఉన్న పార్టీ అని చెప్పాలి! దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల నుంచి బరిలో ఉన్న పార్టీ. ఈ క్రమంలో.. 1951 ఎన్నికల్లో 44.99శాతం ఓట్లతో 364 సీట్లు సాధించిన పార్టీ 2019 ఎన్నికల్లో 19.67శాతం ఓట్లతో కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ పరిస్థితికి గల కారణాలు ఆ పార్టీ పెద్దలకంటే ఎక్కువ ఇతరులెవరికీ తెలియక పోవచ్చు.
ఇక ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 328 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇలా 400 కంటే తక్కువ సీట్లలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో... భారత ఎన్నికల సంకీర్ణ యుగం అని పిలువబడే 1989 - 1999 మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ 450 సీట్లకు పైగా అభ్యర్థులను నిలబెట్టింది. ఇక గత దఫాలుగా పరిస్థితిలో కూడా అనూహ్యంగా గ్రాఫ్ పడిపోతూ కనిపించింది!
ఇందులో భాగంగా... 2004 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 417 స్థానాల్లో పోటీ చేయగా.. 145 సీట్లు మాత్రమే గెలుచుకుంది! అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో 440 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా కాస్త మెరుగుపడి 206 స్థానాల్లో గెలుపొంది వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ రూపంలో కేంద్రంలోని కాంగ్రెస్ కు బలమైన మద్దతు లభించిందనే చెప్పాలి!
ఈ క్రమంలో 2014లో 464 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లోనే గెలుపొందగా.. 2019 ఎన్నికల్లోనూ 421 స్థానాల్లో పోటీ చేసి 52 చోట్ల విజయం సాధించింది. ఈ సమయంలో ఫస్ట్ టైం 400 కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి గల కారణం పొత్తు ధర్మం అనేది తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆ పార్టీ నేతృత్వంలోని "ఇండియా" కూటమి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే!
మరి మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పెర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది.. దేశంలో "ఇండియా" కూటమి అధికారంలోకి రాగలుగుతుందా అనేది వేచి చూడాలి. కాగా.. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగియగా.. మిగిలిన దశలు మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
1951 నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే...
1951 - 364 ఎంపీ సీట్లలో గెలుపు - 44.99 శాతం OTlu
1957 - 371 సీట్లు - 44.78 శాతం ఓట్లు
1962 - 361 సీట్లు - 44.72 శాతం ఓట్లు
1967 - 283 సీట్లు - 40.78 శాతం ఓట్లు
1971 - 352 సీట్లు - 43.68 శాతం ఓట్లు
1977 - 154 సీట్లు - 34.52 శాతం ఓట్లు
1980 - 353 సీట్లు - 42.69 శాతం ఓట్లు
1984 - 404 సీట్లు - 49.10 శాతం ఓట్లు
1989 - 197 సీట్లు - 39.53 శాతం ఓట్లు
1991 - 232 సీట్లు - 35.66 శాతం ఓట్లు
1996 - 140 సీట్లు - 28.80 శాతం ఓట్లు
1998 - 141 సీట్లు - 25.82 శాతం ఓట్లు
1999 - 114 సీట్లు - 28.30 శాతం ఓట్లు
2004 - 145 సీట్లు - 26.7 శాతం ఓట్లు
2009 - 206 సీట్లు - 28.55 శాతం ఓట్లు
2014 - 44 సీట్లు - 19.52 శాతం ఓట్లు
2019 - 52 సీట్లు - 19.67 శాతం ఓట్లు
2024 ...?