ధర్మపురి శ్రీనివాస్.. ఈ విషయాలు తెలుసా?
ఆయన గురించి చాలా తక్కువ గా తెలుసునని కూడా చెప్పడంలో సందేహం. వెలుగు చూడని విషయాలు చాలానే ఉన్నాయి.
By: Tupaki Desk | 29 Jun 2024 6:06 AM GMTధర్మపురి శ్రీనివాస్.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 76 ఏళ్ల వయసులో ఆయన గుండె సంబంధిత సమ స్యతో కన్నుమూశారు. జ్యాతస్యహి ధ్రువో మృత్యుః అన్నట్టు అందరూ ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోవాల్సిం ది. కానీ, కొంతైనా మంచిని వదులుకుని వెళ్లారా? లేదా? అనేదే ప్రామాణికం. ధర్మపురి శ్రీనివాస్ విషయా న్ని చూస్తే.. అనేక విషయాలు ఆయన మనకు వదిలి వెళ్లారనే చెప్పాలి. ఆయన గురించి చాలా తక్కువ గా తెలుసునని కూడా చెప్పడంలో సందేహం. వెలుగు చూడని విషయాలు చాలానే ఉన్నాయి.
+ ధర్మపురి శ్రీనివాస్‌కు సంగీతమంటే చాలా ఇష్టం. వీణ నేర్చుకోవాలని ఆయన కోరిక. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలంటే చెవికోసుకునేవారు. అనేక సందర్భాల్లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కచేరీలకు ఆయన హాజరయ్యారు.
+ తెలుగు భాష అంటే మక్కువ. తెలుగు సంప్రదాయాలకు ఆయన పెట్టింది పేరు. పంచెకట్టుతో ఆయన కనిపిస్తే.. నిండైన తెలుగు దనం మూర్తీభవించినట్టు ఉండేది.
+ డీసీసీ చీఫ్‌లు తప్పులు చేస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున ఆయనకు ఫిర్యాదులు అందితే.. ``నా మీద కూడా.. అధిష్టానానికి అనేక మంది ఫిర్యాదులు చేశారయ్యా.. ఇవి కూడా అంతే!`` అంటూ.. ఉదాత్తత చూపించే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు.
+ స్థాయితో సంబంధం లేకుండా.. సమస్యలు పరిష్కరించే వారంటే ఆయనకు మక్కువ. కలెక్టరే పనిచే యాలి.. సమస్యలు తీరాలి అన్న సూత్రాన్ని ఆయన వ్యతిరేకించారు. క్షేత్రస్థాయిలో సాధ్యమైనంత వరకు పనిచేయించుకోవాలని డీఎస్ చెప్పేవారు.
+ డీఎస్ భోజన ప్రియులు. అనేక రకాల రుచులు ఆయన ఆశ్వాదించేవారు. వెజ్,నాన్ వెజ్ వెరైటీల్లో ఆయనకు నచ్చని పదార్థం అంటూ ఏమీ లేదు. అయితే.. హైదరాబాద్ మటన్ బిర్యానీని ఇష్టంగా తినేవారు. అంతేకాదు.. తనతో ఎంత మంది ఉన్నా..అందరూ కలిసి భోజనం చేయాలని చెప్పేవారు.
+ పార్టీపై అంకిత భావం ఎక్కువగా ఉన్న డీఎస్.. గతంలో ల్యాండ్‌లైన్లు ఉన్నప్పుడు కూడా.. వాటికి అందుబాటులో ఉండేవారు. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా.. నేను చూసుకుంటా! అంటూ భరోసా ఇచ్చేవారు.
+ తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు. ప్రతి బోనాలకు.. ఆయన ఇంటిముందు.. తొలిబోనం ఎత్తేవారు. సికింద్రాబాద్ ఆలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. పెద్దమ్మగుడిలో ఇప్పటికీ.. ఆయన కట్టించిన మండపం ఉంటుంది.
+ కార్యకర్తలను ప్రోత్సహించడమే కాదు.. వారి సమస్యలు కూడా పరిష్కరించే వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా.. మండలస్థాయిలో కమిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు.
+ ఫిర్యాదులు మోయడాన్ని.. చెప్పడాన్ని తగ్గించేవారు. తాను కూడా ఎవరిపైనా ఫిర్యాదులు చేసేవారు కాదు.