Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎవరి పాలిట భస్మాసుర హస్తం ?

ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఈసారి అలా ఉండే సీన్ అయితే లేదు.

By:  Tupaki Desk   |   15 April 2024 3:00 AM GMT
వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎవరి పాలిట భస్మాసుర హస్తం ?
X

ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఈసారి అలా ఉండే సీన్ అయితే లేదు. కొన్ని చోట్ల కచ్చితంగా కాంగ్రెస్ తన బలాన్ని చూపిస్తుంది. అలా తన వంతు సీట్లను తీసుకుంటుంది. అపుడు వైసీపీ టీడీపీ కూటములలో ఎవరికి చేటు అన్నది భయపెడుతున్న విషయం.

సహజంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బడుగు బలహీన వర్గాలే అనుకోవచ్చు. ఆ ఓట్లు వైసీపీ వద్ద ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి టర్న్ అవుతాయని కూడా అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ కి వారితో పాటు ఇతర వర్గాల ఓట్లు కూడా ఎంతో కొంత పడతాయి కదా. ఆ ఓట్లు కచ్చితంగా కూటమి ఓట్లు కూడా అయి ఉంటాయని అంటున్నారు.

అలా లెక్క వేసుకుంటే కాంగ్రెస్ ఏపీలో పోటీ చేసే కొన్ని సీట్లలో అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమిని భయపెట్టడం ఖాయమని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ వల్ల టీడీపీ వైసీపీ ఇద్దరి ఓట్లకు గండి పడతాయని అంటున్నారు ఆమె కనీసంగా పాతిక ముప్పయి వేల ఓట్లను తీసుకుంటారు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే గోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు బాగానే ఓట్లు చీలుస్తారు అని అంటున్నారు. ఆయన ఓట్లు ఎంత చీలిస్తే అంతలా ఇతర పార్టీల విజయావకాశాలకు గండి పడుతుంది అని అంటున్నారు. అవి ఎవరికి అన్నవి ఫలితాల తర్వాత తేలుతుంది అని అంటున్నారు. అలాగే ఉమ్మడి క్రిష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియా కుమారి పోటీ చేస్తున్నారు. ఆమెకు సొంతంగా బలం ఉంది. కచ్చితంగా ఆమె పాతిక నుంచి ముప్పయి వేల ఓట్లను తెచ్చుకుంటారు అని అంటున్నారు.

అది కచ్చితంగా ప్రధాన పార్టీలకు ఇబ్బంది అని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఎంపీ సీటుకు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. ఆయనకు సొంత ఓటు బ్యాంకు కొంత ఉంది. అది ఎవరికి చిల్లు పెడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన చింతలపూడి, నందికొట్కూరు, పూతలపట్టు, పి.గన్నవరంల నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి టికెట్లు సంపాదించారు. వారు సిట్టింగులు కాబట్టి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. ఆ ఓట్లు కచ్చితంగా వైసీపీ నుంచే వెళ్తాయని అంటున్నారు. అలా ఆ పార్టీకి దెబ్బ అంటున్నారు.

ఇక అనంతపురం జిల్ల సింగనమలలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ పోటీలో ఉన్నారు. ఆయనకు కూడా సొంత పలుకుబడి ఉంది. ఆయన ప్రధాన పార్టీల గెలుపు ఓటంలులను ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఒంగోలు జిల్లాలో చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ పోటీ చేస్తున్నారు. ఆయన భారీగానే ఓట్లు చీలుస్తారు అని అంటున్నారు. ఆయన గెలుస్తారని కూడా ఆయన వర్గం అంటోంది.

ఇక కాంగ్రెస్ తో కలసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్న వామపక్షాలు కూడా చాలా చోట్ల ఓట్ల చీలికలో ముఖ్య భూమిక పోషిస్తాయని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న సీపీఎం నాయ‌కుడు చిగురుపాటి బాబూరావు వల్ల కూటమికి దెబ్బ అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ఓటమి పాలు కావడానికి ఈయనకు వచ్చిన ఇరవై వేల ఓట్లు కూడా కరణం అంటున్నారు. ఈసారి ఆయన అంతే స్థాయిలో ఓట్లు తెచ్చినా ఇబ్బందే అన్నది ఒక మాటగా ఉంది. అలాగే మంగళగిరి గాజువాకలలో సైతం కామ్రేడ్స్ పోటీ వల్ల కూటమికి దెబ్బ పడుతుందని అంటున్నారు.

ఇలా లెక్క వేసుకుంటే ఇండియా కూటమి పేరుతో పోటీలోకి వస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్టుల పోటీ వల్ల ఉత్తరాంధ్రా నుంచి రాయలసీమ వరకూ ఉన్న పలు కీలక నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలకు ఓట్లు చీలడం ఖాయం. ఎందుకంటే ఈసారి వేవ్ అంటూ కనిపించడంలేదు. అందువల్ల ప్రజలు తమకు తోచిన పార్టీలకు కూడా ఓట్లు వేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో కాంగ్రెస్ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు. అది ఎవరిని అన్నదే తేలాల్సి ఉంది అని అంటున్నారు.