ఆ ఇద్దరి చేతుల్లోనూ మోడీకి కష్టమేనట... కాంగ్రెస్ పోస్ట్ వైరల్!
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది
By: Tupaki Desk | 7 Jun 2024 4:09 AM GMTదేశవ్యాపంగా లోక్ సభ ఎన్నికలు ముగియడం, ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి రావడం తెలిసిందే. అయితే ఈసారి అనూహ్యంగా మోడీ కంటే సీనియర్స్ అయిన చంద్రబాబు, నితీశ్ కుమార్ లు ఈసారి ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు.. అంతకంటే ముందు ఈసారి కేంద్రంలోని ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్ పెట్టింది.
అవును... లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం.. కేంద్రంలోని ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వెళ్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటీకీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీయేలో అన్ని పార్టీలూ.. ప్రధానంగా చంద్రబాబు, నితీష్ కుమర్ ల మద్దతు అవసరం పడింది!
వాస్తవానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేయడాన్నికి సరిపడా సీట్లు దక్కించుకున్నప్పటికీ.. బలమైన ప్రభుత్వం మాత్రం కాదని ఇండీయా కూటమి నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఒక ఇమేజ్ ను షేర్ చేసింది. అందులో నితీష్ కుమార్ - చంద్రబాబులు.. మోడీని చేతులు పట్టుకుని ఒకరు ఒకవైపు, మరొకరు ఇంకోవైపు లాగుతున్నారు.
ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో కింది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ సీనియర్ లు ఇద్దరూ మోడీని ప్రశాంతంగా ఉండనిస్తారా అని ఒకరు కామెంట్ చేస్తుంటే... కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్లూ ఇలానే టైంపాస్ చేయాలని మరొకరు స్పందిస్తున్న పరిస్థితి!
కాగా... ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా... చంద్రబాబు టీడీపీ - 16, నితీష్ కుమార్ జేడీయూ - 12 స్థానాలనూ గెలుచుకున్నాయి. ఇవి మొత్తంగా 28 స్థానాలను కలిగి ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఎన్డీయె ప్రభుత్వం ఏర్పడితే.. అందులో టీడీపీ, జేడీయులదే పెద్ద పాత్ర కాబోతుందని అంటున్నారు. మరి ఏమి జరగబోతుంది.. ఎలా జగరబోతుందనేది వేచి చూడాలి!