Begin typing your search above and press return to search.

బీజేపీ హ్యాట్రిక్ సక్సెస్ మీద కాంగ్రెస్ సీనియర్ జోస్యం...!

ఫిబ్రవరి 9తో బడ్జెట్ సెషన్ కంప్లీట్ కాగానే ఎన్నికల రంగంలోకి దిగాలని బీజేపీ చూస్తోంది.

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:00 AM GMT
బీజేపీ హ్యాట్రిక్ సక్సెస్ మీద కాంగ్రెస్ సీనియర్ జోస్యం...!
X

కేంద్రంలో వరసగా మూడవసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. దాని కోసం హిందూత్వ కార్డుని మరోసారి గట్టిగానే వాడుకుంటోంది. ఫిబ్రవరి 9తో బడ్జెట్ సెషన్ కంప్లీట్ కాగానే ఎన్నికల రంగంలోకి దిగాలని బీజేపీ చూస్తోంది.

బీజేపీకి రామమందిరం అయోధ్య రాముడు ఈసారి కూడా కాపాడుతాడు అన్న గట్టి నమ్మకం అయితే ఉంది. ఇదిలా ఉంటే బీజేపీకి 2019లో సొంతంగానే 300కి పైగా సీట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ సీట్లు గణనీయంగా పెంచుకోవాలని ఆ పార్టీ చూస్తోంది.

బీజేపీకి నాలుగు వందల దాకా ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయోధ్య రామాలయంతో మరోసారి ఉత్తర భారతం అంతా బీజేపీకి అనుకూలంగా ఊపేస్తుంది అన్నది కాషాయం పార్టీ పెద్దల ధీమా. ఇక సౌత్ లో సీట్లు తక్కువ పడినా మిత్రులు ఎటూ ఉంటారు అన్న ధీమా ఉంది.

దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజయం మీద ఫుల్ కాంఫిడెన్స్ తో ఉంది. అయితే బీజేపీకి హ్యాట్రిక్ విక్టరీ అన్నది అంత ఈజీ కాదని ఈసారి పెద్ద ఎత్తున సీట్లు ఆ పార్టీకి తగ్గుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ అంటున్నారు

కేరళలోని తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శశిధరూర్ ఆ మధ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి కూడా పోటీ పడ్డారు. ఆయన ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కి విజయావకాశాలు ఈసారి బాగా ఉంటాయని ఆయన ఆశాభావంతో ఉన్నారు.

అదే టైం లో బీజేపీకి ఎండీయే మిత్రులు తగ్గిపోతున్నారని, ప్రతిపక్షాలు సైతం బీజేపీకి ఈసారి మద్దతు ఇవ్వవని ఆయన అంటున్నారు. ఒక విధంగా బీజేపీని కలవరపెట్టే విశ్లేషణనే శశిధరూర్ చేశారు. ఆయన లెక్క ఏంటి అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర కాంగ్రెస్ విజయావకాశలు బాగా పెంచుతుందని, లౌకిక వాదం అజెండా కాంగ్రెస్ కి ఈసారి పెద్ద ఎత్తున సీట్లు తెచ్చి పెడుతుదని అంటున్నారు.

అదే విధంగా చూస్తే ఇండియా కూటమిలోనే బలమైన ప్రతిపక్షాలు అన్నీ ఉన్నాయని, ఈసారి అంతా ఐక్యంగా ముందుకు వెళ్లడం కూడా కూటమి విజయావకాశాలు పెంచుతుందని ఆయన భావిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఈసారి వర్కౌట్ కాదని ఈ సీనియర్ నేత అంచనా కడుతున్నారు. ఒక విధంగా బీజేపీ మూడవసారి పీఠం దక్కించుకోదు అని ఆయన చేస్తున్న ప్రకటనలు కమలనాధులలో ఒకింత కలవరం రేపుతున్నాయి. చూడాలి మరి బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోందో.