Begin typing your search above and press return to search.

ఈటలను ఫాలో అవుతున్న కాంగ్రెస్ సీనియర్లు... వామ్మో బిగ్ ట్విస్ట్!

ఇక్కడ మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే... తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందట! ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 9:39 AM GMT
ఈటలను ఫాలో అవుతున్న కాంగ్రెస్  సీనియర్లు... వామ్మో బిగ్  ట్విస్ట్!
X

తెలంగాణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మలి జాబితా ఈరోజు విదుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇది మలి జాబితానే కానీ తుది జాబితా కాదనేది ఇక్కడ కీలకంగా ఉంది. అంటే... ఇంకా మొత్తం నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం లేదన్నమాట. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అవును.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మరోపక్క వరుసగా చేరికలు జరుగుతున్నాయి. బీఆరెస్స్, బీజేపీలలోని పలువురు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఈ సమయంలో మలివిడత జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో... మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో గంటన్నరపాటు సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని తెలుస్తుంది.

అయితే ఈ 45 మంది అభ్యర్థులనూ ఒకేసారి ప్రకటిస్తారా.. లేక, విడల వారీగా విడుదల చేస్తారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే... ఈ 45 నియోజకవర్గాలలోనూ 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో వాటిని మాత్రం పెండింగ్‌ లో ఉంచుతున్నారని తెలుస్తుంది.

అసంతృప్తులు అనే మాట వినిపించకుండా ఉండేందుకు.. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఈ లిస్ట్ విడుదల చేస్తారని అంటున్నారు. ఇలా పెండింగ్‌ లో ఉన్న నియోజకవర్గాల్లో ప్రధానంగా, అత్యంత క్లిష్టంగా... ఖమ్మంలో ఇల్లందు, పాలేరు.. నల్లగొండ జిల్లాలో దేవరకొండ, తుంగతుర్తి, సూర్యాపేట.. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మక్తల్, జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే... మలివిడత జాబితా ఎప్పుడనేదానిపై స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ స్పష్టత ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేసినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు

ఇక్కడ మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే... తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందట! ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే... కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి.. హరీష్‌ రావు పోటీ చేస్తున్న సిద్దిపేట.. కేటీఆర్‌ నిలబడుతున్న సిరిసిల్లలోనే ఈ పోటీ ఉండనుందని తెలుస్తోంది.

ఆయా నియోజకవర్గాల్లో... బరిలోకి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తం కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో... ఈసారి తెలంగాణ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయని తెలుస్తుంది.

కాగా... బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర మాత్రమే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీఅర్ నియోజకవర్గం గజ్వేల్ లోనూ ఈటల బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.