Begin typing your search above and press return to search.

మోడీదేం పోయింది.. కాంగ్రెస్ పార్టీనే లాక్కోలేక.. పీక్కోలేక చ‌స్తోందట‌!

దీని ని స‌మ‌ర్థిస్తే.. ఒక తంటా.. స‌మ‌ర్థించ‌క‌పోతే మ‌రో తంటా అంటూ.. కాంగ్రెస్ ప‌రిస్తితిని జాతీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2023 11:36 AM GMT
మోడీదేం పోయింది.. కాంగ్రెస్ పార్టీనే లాక్కోలేక.. పీక్కోలేక చ‌స్తోందట‌!
X

రాజ‌కీయ విశ్లేష‌కులు బాహాటంగానే అంటున్న మాట ఇది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కి న‌ష్టం లేద‌ని.. ఏదైనా జ‌రిగితే.. అప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని వారు అంటున్నారు. దీనికి కార‌ణం.. కేంద్రం తీసుకువ‌స్తాన‌ని చెబుతున్న ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లు. దీనిని ఆమోదించి తీరుతామ‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. అంతేకాదు.. కేంద్ర స‌ర్కారు కూడా త‌న వ్యూహాల‌ను ప‌దును పెట్టింది.

త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీల‌ తో ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ ఈ నెల 18న భేటీ కానున్నారు. ఒక‌వేళ ఎవ‌రూ అంగీక‌రించినా లేక‌పోయినా.. లోక్‌స‌భ‌ లో అయితే.. ఓకే అయిపోతుంది. దీంతో బీజేపీ ప్ర‌భుత్వంధీమాగానే ఉంది. ఇక‌, ఈ బిల్లు ఓకే చేయిస్తే.. మైనారిటీ ఓట్లు పోతాయ‌నే బెంగ బీజేపీ కి లేనేలేదు. ఎందుకంటే.. ఆపార్టీ ఎప్ప‌టి నుంచో మైనారిటీల‌ ను ప‌క్క‌న పెట్టింది. గత లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రికీ టికెట్ ఇవ్వ‌లేదు.

సో.. ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌.. కాంగ్రెస్‌ మీద‌ కు వ‌చ్చింది. కాంగ్రెస్ కు మైనారిటీ ఓటు బ్యాంకు కీల‌కం. గ‌తం లోనూ.. ఇప్పుడు ఎప్పుడూ.. కూడా అన్ని మైనారిటీ వ‌ర్గాలు(బౌద్ధులు.. జైనులు, ముస్లింలు.. క్రిస్టియ న్లు) ఇలా.. అంద‌రూ కాంగ్రెస్‌ కు కావాలి. కానీ, ఇప్పుడు ఉమ్మ‌డి పౌర‌స్మృతి విష‌యం లో ఏం చేయాలి? దీనిని వ్య‌తిరేకించ‌క‌పోతే.. ఆయా వ‌ర్గాలు హ‌ర్ట్ అవుతాయి. వ్య‌తిరేకిస్తే.. హిందూ సామాజిక‌వ‌ర్గం మ‌నోభావాలు దెబ్బ తీసిందంటూ.. బీజేపీ నేత‌లు దేశ‌వ్యాప్తంగా టాం టాం చేస్తారు.

దీంతో కాంగ్రెస్‌ కు ఇప్పుడు తీవ్ర ఇర‌కాటం లో ప‌డింద‌ ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు పై ఏం చేయాల‌నే విష‌యాన్ని తేల్చుకునేందుకు అగ్ర‌నేత రాహుల్ గాంధీ నేతృత్వం లో పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే స‌హా.. త‌ల‌పండిన నాయ‌కులు ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. దీని ని స‌మ‌ర్థిస్తే.. ఒక తంటా.. స‌మ‌ర్థించ‌క‌పోతే మ‌రో తంటా అంటూ.. కాంగ్రెస్ ప‌రిస్తితిని జాతీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.