కాంగ్రెస్ టార్గెట్ 200 సీట్లు !
గతంతో పోలిస్తే ఈసారి ఉత్తరాదిన మార్పు కనిపిస్తోందని కాంగ్రెస్ అంచనా కడుతోంది.
By: Tupaki Desk | 13 May 2024 4:03 AM GMTదేశంలో 2009 నాటి సీన్ ని రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి ఎలాగైనా 200 మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తరాదిన మార్పు కనిపిస్తోందని కాంగ్రెస్ అంచనా కడుతోంది.
ఈసారి బీజేపీకి ఉత్తరాదిన అంత సానుకూలత లేకపోవచ్చు అన్నదే కాంగ్రెస్ లెక్కగా ఉంది. యూపీలో ఎస్పీతో కాంగ్రెస్ జత కట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితే తమ కూటమికి మొత్తం 80 సీట్లలో డెబ్బై దాకా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గతసారి ఎస్పీకి వచ్చినవి అయిదంటే అయిదే కావడం విశేషం.
కానీ ఈసారి ఆయన పెద్ద నంబరే చెబుతున్నారు. గతసారి డెబ్బైకి పైగా బీజేపీ కైవశం చేసుకుంది. ఈసారి బీజేపీకి ఆ సంఖ్య బాగా తగ్గుతుంది అని అంటున్నారు. అదే టైం లో బీజేపీ పట్ల జనాలలో గతం కంటే మోజు తగ్గిందని కూఒడా అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ యూపీలో సొంతంగా డబుల్ డిజిట్ నంబర్ ని తెచ్చుకోవాలని ఆశపడుతోంది.
ఇక మరో వైపు చూస్తే కాంగ్రెస్ కి ఆశ ఉన్నది పంజాబ్ మీద అలాగే హర్యానా మీద. పంజాబ్ లో ఆప్ తో పొత్తులు ఉన్నాయి. దాంతో కొన్ని సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయని అంటున్నారు. హర్యానా బీజేపీలో సరిగ్గా ఎంపీ ఎన్నికల ముందే లుకలుకలు చోటు చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు.
దాంతో కాంగ్రెస్ చూపు ఇక్కడ కూడా ఉంది. అలాగే గుజరాత్ విషయంలోనూ కాంగ్రెస్ ఆశలు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు ఎన్నికల నుంచి 26కి 26 ఎంపీ సీట్లూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి మాత్రం అలా కుదరదు అంటోంది అక్కడి రాజకీయం. బీజేపీ పట్ల అసంతృప్తి పేరుకుపోవడంతో ఈసారి క్లీన్ స్వీప్ కష్టమని అంటున్నారు.
దాంతో కాంగ్రెస్ ఇక్కడ నాలుగు నుంచి అయిదు సీట్లు గెలుచుకునేందుకు చూస్తోంది. ఢిల్లీలో 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి ఆప్ అధినేత కేజ్రీవాల్ ని జైలులో పెట్టడంతో ఆయనకు సానుభూతి ఉంది. అలాగే ఆప్ పట్ల జనంలో ఆదరణ ఉంది. ఆప్ తో జతకట్టిన కాంగ్రెస్ కి ఢిల్లీలో ఈసారి కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తాయని అంటున్నారు.
అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనను చీల్చి బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది కానీ ఎన్నికల వేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. అక్కడ ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ కూటమికి మెజారిటీ సీట్లు దక్కుతాయని అంటున్నారు. అలాగే బీహార్ లో కూడా ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. ఈసారి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నారు.
ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో తమకు ఎంపీ సీట్లలో కొంత జనాలు కరుణిస్తారు అని కాంగ్రెస్ ఆశిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్ మీద హోప్స్ పెట్టుకుంది. మొత్తంగా చూస్తే రెండు వందల ఎంపీ సీట్లు సొంతంగా గెలిస్తే ప్రభుత్వం తమదే అని కాంగ్రెస్ పెద్దలు ధీమాగా ఉన్నారు.
2009లో కాంగ్రెస్ 206 సీట్లు గెలుచుకుంది, ప్రభుత్వాన్ని మిత్రుల సాయాంతో ఏర్పాటు చేసింది. ఈసారి కూడా 200 సీట్లు గెలిస్తే చాలు మిత్రులకు వంద సీట్లు వస్తాయని మ్యాజిక్ ఫిగర్ ని దాటే నంబర్ ఉంటుందని భావిస్తఒంది. మొత్తం మీద చూస్తే కనుక కాంగ్రెస్ ఈసారి ప్రభుత్వం మీద భారీ ఆశలే పెట్టుకుంది.