Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి అసెంబ్లీ ఓట్ పర్సంటేజ్ కలిసి వస్తుందా?

అసెంబ్లీ ఎన్నికల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో పార్లమెంట్ సీట్లను దక్కించుకోవాలని అనుకుంటుంది. దీని కోసం మాస్టర్ ప్లాన్ ను కూడా సిద్ధం చేస్తుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 12:30 AM GMT
కాంగ్రెస్ కి   అసెంబ్లీ ఓట్ పర్సంటేజ్ కలిసి వస్తుందా?
X

అసెంబ్లీ ఎన్నికల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో పార్లమెంట్ సీట్లను దక్కించుకోవాలని అనుకుంటుంది. దీని కోసం మాస్టర్ ప్లాన్ ను కూడా సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంను ఒక్క స్థానానికే పరిమితం చేయాలని భావించి ప్రధానంగా 15 సీట్లను టార్గెట్ పెట్టుకుంది. ఒకటి, రెండు అటూ ఇటుగా దక్కించుకోవచ్చని అనుకుంటుంది.

అసెంబ్లీ ఓట్ పర్సంటేజ్ కలిసి వస్తుందా?

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ ప్రజల్లోకి వెళ్లినా ఆదరణ అంతంతమాత్రంగానే దక్కింది. కానీ ఈ సారి మరింత పట్టు సాధించి 12 స్థానాల్లో పాగా వేయాలని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల పర్సంటేజ్ ను బేరీజు వేసుకుంటుంది. వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసింది. ఈ మాదిరిగానే పార్లమెంట్ లో కూడా ఈ జిల్లాలను స్వీప్ చేయాలని పథకాలు రచిస్తోంది.

వీటితో పాటు పెద్దపల్లి, ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల, జహీరాబాద్ స్థానాలను సైతం తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అందుకు ఆయా స్థానలపై పట్టు ఉన్న ఇతర పార్టీల నేతలను కూడా కలుపుకునేలా స్కెచ్ వేస్తోంది. వారిని ఎలాగైనా కాంగ్రెస్ లో చేర్చుకుంటే కలిసి వస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరితో పాటు సికింద్రాబాద్ ను తిరిగి కైవసం చేసుకోవడం, వీటితో పాటు కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ స్థానాలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మజ్లిస్ కు విడిచిపెట్టాలని అనుకుంటుంది. బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో కట్టడి చేసినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కట్టడి చేయాలని అనుకుంటుంది.

బీఆర్ఎస్ ను ఒక్కసీటుకే పరిమితం చేయాలని పావులు కదుపుతుంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీని కూడా అదిలాబాద్ కే పరిమితం చేయాలని చూస్తోంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్నా.. ఆ సంఖ్యకు కాంగ్రెస్ చెక్ పెట్టేలా కనిపిస్తుంది. దాదాపు ఫిబ్రవరి చివరికి లేదంటే మార్చిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

ఇలా షెడ్యూల్ విడుదల కాగానే అలా.. జనాల్లోకి దూసుకెళ్లాలా ఇప్పటి నుంచే ప్లాన్లు సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న మోడీ హవాను అస్సలు వినిపించకుండా.. కనిపించకుండా.. చూడాలని పార్టీ అధినాయకులకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన బీజేపీకి పట్టు లేదని, ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది.