కాంగ్రెస్ టికెట్ ఓకే.. అసలు సమస్య ఇదే!
వీరిలో ఆశ్చర్యకరంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 16 Jan 2024 2:30 AM GMTఏపీలో రాజకీయ పరిణామాలు అందరూ అనుకుంటున్నట్టుగా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నాయి. వైసీపీలో టికెట్‌లు దక్కని వారు.. టికెట్ కోసం వేచి ఉండి.. ఇక, ఆశలు వదులుకున్న వారు.. కాంగ్రెస్‌లో తప్ప తాము ఏ పార్టీలోకి చేరేదిలేదని.. భీష్మించుకున్నవారు.. ఇప్పుడు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నా రు. వీరిలో ఆశ్చర్యకరంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా భోగిని పురస్కరించుకుని.. ఆయన ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు.
అయితే, ఈ సందర్భంగా ఉండవల్లి కాంగ్రెస్‌లోకి రావాలని.. లేదా సలహాదారుగా అయినా ఉండాలని వారు కోరుకున్నారు. దీనికి ఆయన సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపారని పార్టీ నాయకులు చెబుతు న్నారు. మరోవైపు.. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పదవులు పొందిన గాదె వెంకట రెడ్డి, కనుమూరి బాపిరాజు, ఆయన తనయుడు, డీఎల్ రవీంద్రారెడ్డి, రాయపాటి సాంబశివరావు, ఆయన తనయుడు రంగారావు వంటి సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆశలు పెట్టుకున్నవారే.. వారు కాకపోతే.. వారి కుటుంబ సభ్యుల ను రంగంలోకి దింపాలనేది వీరి ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి వస్తే.. టికెట్ ఖాయమని.. ఇక, తమకు ఎదురు ఉండదని ఒక వాదన వినిపిస్తున్నారు. ఇదేసమయంలో మరో చిక్కు వారిని వెంటా డుతోంది. ఎన్నికల ఖర్చులు ఒక సమస్య అయితే.. కాంగ్రెస్‌లోకి వెళ్లడం ద్వారా.. ఇటు వైసీపీకి, అటు మోడీకి కూడా.. తాము శతృవులుగా మారితే వ్యాపారాలపై ప్రభావం చూపుతుందనే ఆలోచన ఉంది.
దీంతో ఈ నేతలు ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల పగ్గాలు చేపడితే.. ఆ తర్వాత మారే పరిణామాలను అంచనా వేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకునే దిశగా కూడా వీరి ఆలోచన ఉందని అంటున్నారు. కొందరు నాయకులు ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు చేయకుండా.. తర్వాత వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.