Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పకడ్బంధీగా.. జాతీయ నేతలు, వార్ రూమ్ లు

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నా కాంగ్రెస్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   6 Nov 2023 2:30 PM GMT
కాంగ్రెస్ పకడ్బంధీగా.. జాతీయ నేతలు, వార్ రూమ్ లు
X

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నా కాంగ్రెస్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదనే చెప్పాలి. ఈ సారి రాష్ట్రంలో గెలిచే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అన్ని విధాలుగా పటిష్ఠ కార్యచరణతో ముందుకు సాగుతోంది. జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తోంది. మరోవైపు వార్ రూమ్ లతో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తోంది. ఇతర రాష్ట్రల నేతలను బరిలో దించుతూ, పరిస్థితిని అంచనా వేస్తూ విజయం దిశగా పార్టీని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కష్టపడుతోంది.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో ఎన్నికల పరిశీలకులను పెద్ద సంఖ్యలో మోహరిస్తోంది. ఇటీవల 10 మంది ఇతర రాష్ట్రాల నేతలను రాష్ట్ర స్థాయి ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక నేతలు దినేశ్ గుండూరావు, కె.హెచ్.మునియప్ప, క్రిష్ణ తదిరులతో కాంగ్రెస్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జీ మాణిక్రావు ఠాక్రే హైదరాబాద్ లోనే మకాం వేసి దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతలు తీసుకున్నారనే చెప్పాలి.

ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంపై ముగ్గురు నేతల పర్యవేక్షణ ఉందనే చెప్పాలి. వీళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడూ అంచనా వేసి నివేదికలు రూపొందిస్తున్నారు. వీటిని బట్టి కాంగ్రెస్ తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు ఇక్కడ తెలంగాణలో, అక్కడ జాతీయ స్థాయిలో వార్ రూమ్ లు ఏర్పాటు చేసి స్థానిక నేతల పనితీరును మదింపు చేస్తున్నట్లు సమాచారం. గాంధీభవన్ లో, దిల్లీలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కీలకంగా మారనున్నాయని తెలిసింది. ఇలా అన్ని రకాలుగా పార్టీ విజయం కోసం కాంగ్రెస్ సర్వ శక్తులూ ఒడ్డుతోందని చెప్పాలి.