Begin typing your search above and press return to search.

మేనరికపు వివాహాలు చేసుకుంటే ఎంత డేంజర్ అంటే?

మేనరికం వివాహాలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మేనరికం వల్ల ఒకే రక్తం కావడంతో ఇలాంటి రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   11 April 2024 4:30 PM GMT
మేనరికపు వివాహాలు చేసుకుంటే ఎంత డేంజర్ అంటే?
X

పూర్వం రోజుల్లో మేనరికం వివాహాలు విరివిగా జరిగేవి. దీంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తేవి. మేనరికం వల్ల ఒకే రకమైన రక్తం ఇద్దరిలోనూ ప్రవహించడం వల్ల పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్యులే వెల్లడిస్తున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం మేనరికం పెళ్లిళ్లు చేసుకున్న వారి పిల్లల్లో ఇలాంటి లోపాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో మేనరికం చేసుకోకపోడమే మేలని అంటున్నారు.

ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి జరిపిన అధ్యయనంలో ఈ మేరకు పలు విషయాలు తెలిశాయి. మేనరికం వల్ల పిల్లలకు నేత్ర సంబంధ సమస్యలు వస్తాయని తేలింది. కార్నియాలో మచ్చలు, శుక్లాలు, గ్లకోమా, రెటినైటిస్ పిగ్మెంటోసా తలెత్తే ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఇలా మేనరికం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో మేనరికాలు చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు.

మేనరికం వివాహాలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మేనరికం వల్ల ఒకే రక్తం కావడంతో ఇలాంటి రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మేనరికం చేసుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు.

దీనిపై పలు రకాల పరిశోధనలు జరిగాయి. జన్యుపరమైన లోపాలు తలెత్తితే వాటిని ముందే గుర్తించి చికిత్స చేయించుకుంటే ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు. మందుల ద్వారా నయం చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇలా మేనరికం వల్ల పలు అనారోగ్య సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీంతో మేనరిక వివాహాలు చేసుకోవడానికి ఇప్పుడు ముందుకు రావడం లేదు.

భవిష్యత్ లో వీటి వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయి. సాధ్యమైనంత వరకు మేనరిక వివాహాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. చదువుకుంటున్న యువత మేనరికపు వివాహాల గురించి చైతన్యం తెచ్చుకుని మేనరికం పెళ్లిళ్లు చేసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జన్యుపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలని చెబుతున్నారు.