Begin typing your search above and press return to search.

అనుకూలం వర్సెస్ ప్రతికూలం... హెచ్-1బీ వీసాపై రసవత్తర చర్చ!

ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jan 2025 4:19 AM GMT
అనుకూలం వర్సెస్  ప్రతికూలం... హెచ్-1బీ వీసాపై రసవత్తర చర్చ!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచీ ఇమ్మిగ్రేషన్స్, హెచ్-1బీ వీసా, ఓపీటీ లపై కీలక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఇప్పుడు హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ పై రిపబ్లికన్స్, డెమోక్రాట్ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పలువురు డెమోక్రాట్లు మస్క్ తో ఏకీభవించడం గమనార్హం.

అవును... ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా భారతీయులకు కీలకమైన హెచ్-1బీ వీసాలపై చర్చ సంచలన స్థాయిలో మొదలైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వీసాలపై అనుకూలులు, వ్యతిరేకుల మధ్య చర్చ రగులుతుంది!

వాస్తవానికి ప్రతి ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలు, 20 వేళ స్టూడెంట్ వీసాలను అమెరికా విడుదల చేస్తుంది. వీటిలో హెచ్-1బీ వీసాలు పొందేవరిలో భారతీయులు అత్యధికంగా ఉంటారు. అయితే.. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఈ హెచ్-1బీ వీసాలకు మద్దతు పలికారు.

ఇదే సమయంలో ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి కూడా హెచ్-1బీ వీసాలకు అనుకూలంగా ఉన్నారు. ఇదే సమయంలో... డెమోక్రాటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, శ్రీథానేదార్ లు కూడా ఈ విషయంలో రిపబ్లికన్స్ వాదనను సమర్థిస్తున్నారు. అయితే.. మిగిలిన డెమోక్రాట్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు!

హెచ్-1బీ వీసాలపై ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు?:

అమెరికా అత్యంత సమర్ధులున్న దేశమని.. ప్రతిభా సామర్థ్యాలున్న వ్యక్తులు తమ దేశానికి రావాలని.. గతంలో లాగే అమెరికాలో ఉద్యోగవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

అమెరికాలో నైపుణ్యం కలిగిన అమెరికన్ ఇంజినీర్ల కొరత ఉంది కాబట్టి.. మన దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా హెచ్-1బీ వీసా అవసరమని మస్క్, మొదలైన వారు వాదిస్తున్నారు.. అయితే, వారి వాదనతో నేను విభేదిస్తున్నాను అని.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రసిద్ధ సెనేటర్ బెర్నీ శాండర్స్ అన్నారు.

ఇదే సమయంలో... హెచ్-1బీ వీసా విధాన లక్ష్యం భారీ జీతభత్యాలు చెల్లించాల్సిన అమెరికా ఉద్యోగాల్లో అత్యంత ప్రతిభావంతుల్ని నియమించుకోవడం కాదని.. చౌకగా లభించే విదేశీ పనివాళ్లను కుదుర్చుకోవడమని.. పనివాళ్లు ఎంత చౌకగా లభిస్తే సంపన్నుల సంపద అంతగా పెరుగుతుందని జెర్నీ శాండర్స్ తెలిపారు.

మరోపక్క... ఈ విషయంపై స్పందించిన అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ ఖన్నా... చైనాతో అమెరికా సమర్ధంగా పోటీ పడాలంటే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ అవసరం అని అన్నారు. అయితే... హెచ్-1బీ విధానం దుర్పయోగానికి గురైందని.. అందుకే తాను హెచ్-1బీ వీసా అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బతీయకుండా చట్టసవరణ కోరుతున్నట్లు పేర్కొన్నారు.

కాగా... హెచ్-1బీ వీసా కారణంగానే తాను నేడు అమెరికాలో ఉన్నానని.. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలు నిర్మించానని.. అమెరికాను బలోపేతం చేసిన అనేకులు కూడా హెచ్-1బీ కారణంగానే ఈ దేశానికి వచ్చారని ఎలాన్ మస్క్ స్పందించారు.