Begin typing your search above and press return to search.

ఏపీలో కోరమాండల్‌ రూ.1000 కోట్ల పెట్టుబడులు... నిర్మాణం ప్రారంభం!

అవును... ఎరువుల తయారీ దిగ్గజ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌.. ఆంధ్రప్రదేశ్‌ లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ – సల్ఫరిక్‌ యాసిడ్‌ కాంప్లెక్స్‌ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది.

By:  Tupaki Desk   |   30 April 2024 4:50 AM GMT
ఏపీలో కోరమాండల్‌ రూ.1000 కోట్ల పెట్టుబడులు... నిర్మాణం ప్రారంభం!
X

ఏపీలో జగన్ కు సంక్షేమ పథకాల ప్రాణాళిక, వాటి అమలు విషయంలో నూటికీ నూరు మార్కులు పడతాయనేది అంతా బలంగా చెబుతున్న మాట.. అయితే చాలా మందికి తెలియని విషయం కూడా ఒకటుంది! పారిశ్రామికాభివృద్ధి రేటు విషయంలో రాష్ట్రం 2018-19 నాటికి 3.2 శాతంతో 22వ స్థానంలో ఉండగా.. జగన్ హయాంలో 2021-22 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకింది!

అంటే... అభివృద్ధి విషయంలోనూ విజనరీలను తలదన్ని టాప్ ప్లేస్ లో ఏపీని నిలిపారు జగన్! ఈ విషయం తెలియక కొంతమంది.. తెలిసినా ఆత్మవంచనతో ఇంకొంతమంది అభివృద్ధి విషయంలో జగన్ కు తక్కువ మార్కులేసే ప్రయత్నం చేస్తుంటారు.. అది తప్పని ఇప్పటికే ఎన్నో విషయాలు రుజువు చేశాయి! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మరో విషయం తెరపైకి వచ్చింది.. ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి!

అవును... ఎరువుల తయారీ దిగ్గజ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌.. ఆంధ్రప్రదేశ్‌ లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ – సల్ఫరిక్‌ యాసిడ్‌ కాంప్లెక్స్‌ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ సమయంలో... ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అదేవిధంగా... ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ వెల్లడించారు.

ఇదే క్రమంలో... రోజుకు 650 టన్నుల ఫాస్ఫరిక్ యాసిడ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను తయారు చేసే ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఏ–హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. (డైహైడ్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – హెమిహైడ్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, ఆటోమేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీఎస్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో నిర్మిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అదేవిధంగా... సల్ఫరిక్ యాసిడ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ కోసం 1800 టీపీడీ ప్లాంట్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది!

ప్రస్తుతం.. విశాఖపట్నం, ఎన్నూర్‌ లోని కంపెనీ ఎరువుల కర్మాగారాలు క్యాప్టివ్ సల్ఫ్యూరిక్ - ఫాస్పోరిక్ యాసిడ్ సౌకర్యాలతో పూర్తిగా అనుసంధానించబడ్డాయి. ఈ క్రమంలో... కాకినాడలో ప్రతిపాదించిన విస్తరణ ప్రణాళిక ఈ యూనిట్‌ ను కూడా సమీకృత కాంప్లెక్స్‌ గా చేస్తుందని అంటున్నారు. ఈ కోరమాండల్‌ ప్లాంటు ఫాస్ఫటిక్‌ ఫెర్టిలైజర్‌ తయారీలో దేశంలో రెండవ అతి పెద్దదని చెబుతున్నారు.

ఇలా కాకినాడలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో సమానంగా నిర్మించబడనున్న ఈ ప్లాంట్.. ఫాస్ఫేటిక్ ఎరువులు వ్యవసాయ సమాజానికి స్థిరమైన సరఫరాలను ప్రారంభిస్తుందని అంటున్నారు. ఇది జగన్ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉందిని చెబుతున్నారు. ఈ సమయంలో... ఆంధ్రరాష్ట్రంలో ఎరువుల రంగంలో భారీ ఉపాధి అవకాశాలను సృష్టించబడతాయని స్పష్టం చేస్తున్నారు!