మాస్క్ అవసరం మళ్లీ మొదలైందా?
కొవిడ్ -19 ఎంత ఇబ్బందులకు గురి చేసిందో తెలిసిందే. శానిటైజర్ పూసుకోవడం, క్యూ పద్ధతి పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది
By: Tupaki Desk | 14 Dec 2023 8:30 AM GMTకొవిడ్ -19 ఎంత ఇబ్బందులకు గురి చేసిందో తెలిసిందే. శానిటైజర్ పూసుకోవడం, క్యూ పద్ధతి పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయినా వైరస్ శ్వాసకోశ సమస్యలకు దారి తీసింది. దీంతో అన్ని చోట్ల కొవిడ్ పలు సమస్యలకు కారణమైంది. ఈనేపథ్యంలో కొవిడ్ 19 గురించి ఆలోచనలు వస్తేనే ఊహించుకోవడానికి భయం వేయడం సహజం.
థర్మల్ స్కానర్ ప్రధాన పాత్ర పోషించింది. ఫ్లూ, న్యుమోనియా, శ్వాస కోశ వ్యాధులకు కారణంగా నిలిచింది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. అభం శుభం తెలియని చాలా మంది ప్రాణాలు బలితీసుకుంది. మొదటి విడతలో ముసలి వారు, రెండో విడతలో యువత ప్రాణాలు గాల్లో కలిశాయి. వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. దీంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంది.
కొవిడ్ 19కేసులు అందరిని కలవరపెట్టాయి. ఈనేపథ్యంలో ఇండోనేషియాలో కొవిడ్ వైరస్ మరోమారు తన ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. దీంతో అక్కడ ఆరోగ్య మంత్రిత్వ శాఖ థర్మల్ స్కానర్ ఏర్పాటు చేసి జ్వర తీవ్రతను పరిశీలిస్తోంది. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్ వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
దక్షిణాసియాలోని పలు దేశాల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. మహమ్మారిని కంట్రోల్ లో ఉంచేందుకు జాగ్రత్తలు చేపడుతున్నారు. సింగపూర్ లో కూడా కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ కఠినమైన నిబంనలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలు చేపడుతున్నారు. సింగపూర్ వాసుల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి.
అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో కొవిడ్ మళ్లీ తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్ బుక్ లో కొవిడ్ నియంత్రణ చర్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించడం విశేషం. దీంతో కొవిడ్ నిబంధనలు మరోమారు తెరమీదకు రావడం ప్రజల్ల అలజడి కలిగించేందుకు కారణంగా నిలుస్తున్నాయి. మళ్లీ వైరస్ భయం ప్రజలను వెంటాడుతోంది.