Begin typing your search above and press return to search.

కేంద్ర బ‌డ్జెట్‌: 3 కోట్ల మందికి ఇళ్లు.. 20 ల‌క్ష‌ల మేర‌కు రుణాలు!

అలాగే.. కొత్త‌గా ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు ఇవ్వనున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.

By:  Tupaki Desk   |   23 July 2024 6:37 AM GMT
కేంద్ర బ‌డ్జెట్‌: 3 కోట్ల మందికి ఇళ్లు.. 20 ల‌క్ష‌ల మేర‌కు రుణాలు!
X

వ‌చ్చే ఏడు మాసాల‌కు(ఆగ‌స్టు-మార్చి) ప్ర‌క‌టించిన కేంద్ర బ‌డ్జెట్‌లో దేశ‌వ్యాప్తంగా గూడు లేని నిరుపేద ల‌కు అటు ప‌ట్ట‌ణ‌, ఇటు ప‌ల్లె ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజ‌న కింద‌.. 3 కోట్ల మందికి ఇళ్లు క‌ట్టించి ఇవ్వ నున్న‌ట్టు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అదేవిధంగా స్వ‌యం ఉపాధిని ప్రోత్స‌హించే క్ర‌మంలో ప్ర‌స్తుతం ఇస్తున్న ముద్ర రుణాల ప‌రిమితిని ప్ర‌స్తుతం ఉన్న రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంచుతుఉన్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా.. దేశ‌వ్యాప్తంగా ఉపాధిని పెంచ‌నున్న‌ట్టు చెప్పారు.

అలాగే.. కొత్త‌గా ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు ఇవ్వనున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. కార్పొరేట్ ప‌న్నుల్లోనూ రాయితీ క‌ల్పిస్తామ‌న్నారు. అయితే.. ఏటా నిర్ణీత ఉద్యోగాల క‌ల్ప‌న ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని ష‌ర‌తు విధించారు. దీనికి సంబందించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. పేదలు,మహిళలు,రైతులు,యువత లక్ష్యంగా ప్రత్యేక పథకాలు ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. పూర్తిస్థాయి గైడ్ లైన్స్‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు.

వ‌చ్చే ఐదేళ్ల కాలంలో దేశ‌వ్యాప్తంగా 4 కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్టు కేంద్ర బ‌డ్జెట్‌లో పేర్కొన్నా రు. వీటికి సంబంధించి సెక్టార్ల వారీగా విభ‌జ‌న ఉంటుంద‌న్నారు. వ్య‌వ‌సాయం అనుబంధ రంగాల‌కు రూ.1.52 ల‌క్ష‌ల కోట్ల‌ను వ్య‌యం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక రూపొందించ‌నున్న‌ట్టు తెలిపారు. ఆఫ్‌షోర్‌(స‌ముద్ర గ‌ర్భం) మైనింగ్‌కు నూతన విధానం తీసుకురానున్నారు. సాగర గర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించ‌నున్నారు.