మళ్లీ జన్మ ఉంటుందని నమ్మే దేశాలేవో తెలుసా?
ఈ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పునర్జన్మ ఉందని.. మనిషి మళ్లీ జన్మిస్తాడని చాలా బలంగా నమ్మే దేశాలు చాలానే ఉన్నాయి.
By: Tupaki Desk | 12 Jan 2025 11:30 AM GMTమనిషి జన్మ చాలా అమూల్యమైనదని.. ఎన్నో జన్మల పుణ్యఫలమే మానవ జన్మ అని చాలామంది చెబుతారు. ఇదే సమయంలో ఒకసారి మరణించిన వ్యక్తికి మరో జన్మ ఉంటుందని.. ఈ జన్మలో చేసి పాపపుణ్యాల ఫలితంగా వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. ఈ జన్మలో మనిషిగా పుట్టినవారు వచ్చే జన్మలో అలానే పుడతారని చెప్పలేమని అంటుంటారు.
ఈ సిద్ధాంతాలను చాలా మంది నమ్ముతుంటారు. మరికొంతమంది మాత్రం.. దేవుడు మనిషి సృష్టించాడు.. అతడు దేవునియందు భయ భక్తులు కలిగి నడుచుకుని, పాప విమోచన పొంది, దేవునిలో రక్షణ పొందితే.. ఆయన రెండో రాకడ అనంతరం ఆయనతో పరలోకానికి చేరతారాని.. లేదా, స్వర్గానికి వెళ్తారని.. పాపాలూ చేసిన వారు నిత్యాగ్ని.. లేదా, నరకానికి వెళ్తారని చెబుతారు.
స్వర్గంలో లేదా పరలోకంలో నిత్య సంతోషం ఉంటుందని.. దేవునితోనే సహవాసం చేస్తారని కొంతమంది చెబుతారు. ఇక నరకంలో.. నిత్యాగ్ని ఉంటుందని.. అక్కడ ఏడ్పులు, పండ్లు కొరుకుటయు ఉంటాయని అంటారు. అక్కడ అగ్ని ఆరదు.. పురుగు చావదని అంటారు. ఇలా మనిషి మరణించిన తర్వాత పరిస్థితిపై రకరకాల విశ్లేషణలు, రకరకాల నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి!
ఇక ఇంకొంతమది అయితే... మనిషి మరణించిన తర్వాత మట్టిలో కలిసి పోతాడని.. అతడి జీవితం అక్కడితో ఆఖారని.. స్వర్గం - నరకం, పునర్జన్మ అనేవి అంతా అవాస్తవం అని, అవి భ్రమలు మాత్రమే అని కొట్టి పారేస్తుంటారు. అయితే... పలు ప్రాంతాల్లో జనం మాత్రం పునర్జన్మలను బలంగా నమ్ముతారు.. మనిషి మరో జన్మ ఉందని విశ్వసిస్తారు.
అవును... ఈ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పునర్జన్మ ఉందని.. మనిషి మళ్లీ జన్మిస్తాడని చాలా బలంగా నమ్మే దేశాలు చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న టాప్ దేశాలను ఇప్పుడు చూద్దాం...!
ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్. ఇక్కడ ఉన్న జనాభాలో సుమారు 98.8 శాతం మంది మరోసారి జన్మ ఉంటుందని బలంగా నమ్ముతారంట. తాజాగా వరల్డ్ వేల్యూస్ సర్వే ఈ విషయాలు వెల్లడించింది. బంగ్లాదేశ్ తర్వాత మొరాకో దేశం కూడా మళ్లీ జన్మ ఉంటుందని నమ్ముతుందని చెబుతున్నారు.
పునర్జన్మ ఉందని నమ్మే దేశాల జాబితా!:
బంగ్లాదేశ్ - 98.8%
మొరాకో - 96.2%
లుబియా - 95.2%
టర్కీ - 91.8%
ఇరాన్ - 91.3%
పాకిస్థాన్ - 89.3%
ఈజిప్ట్ - 88.1%
ఫిలిప్పిన్స్ - 83.8%
నైజీరియా - 83.1%