ప్రేమ జంటలకు ఫుల్ ప్రైవసీ... ఈ హోటల్స్ గురించి తెలుసుకోవాల్సిందే?
అవును... ఏకాంతం అనే పదానికి పరిపూర్ణ న్యాయం చేయడానికి ప్రయత్నించేలా జపాన్ దేశంలో సరికొత్త లవ్ హోటల్స్ వెలిశాయి.
By: Tupaki Desk | 25 Nov 2024 9:30 AM GMTఏకాంతం కోసం ప్రేమ పక్షులు, కొత్త జంటలు వెతకని సేఫ్ ప్లేస్ లు ఉండవని చెబుతుంటారు. ప్రధానంగా కొత్తగా పెళ్లైన జంటలు ఉమ్మడి కుటుంబానికి చెందినవి, ఇరుకు ఇళ్లు కలిగినవి అయితే వారు.. ఈ విషయంలో మరింత ఎక్కువగా వెతుకుతారని చెబుతారు. ఇలాంటి ప్రేమ పక్షులు, కొత్త జంటల కోసం జపాన్ లో లవ్ హోటల్స్ వెలిశాయి.
అవును... ఏకాంతం అనే పదానికి పరిపూర్ణ న్యాయం చేయడానికి ప్రయత్నించేలా జపాన్ దేశంలో సరికొత్త లవ్ హోటల్స్ వెలిశాయి. లవ్, జాయ్, బేబీ కిస్ వంటి పేర్లతో.. కిస్, లవ్ సింబల్స్ ఆకారంలో వెలిసిన ఈ హోటల్స్ ఇప్పుడు జపాన్ లో హాట్ టాపిక్ గా మారగా.. వీటికి ప్రేమ పక్షులు, కొత్త జంటలూ క్యూ కడుతున్నాయని అంటున్నారు.
ప్రధానంగా విభిన్న ఆకృతుల్లో సాధారణ బిల్డింగ్స్ మధ్య చూడగానే గుర్తుపట్టేలా స్పెషల్ గా వీటిని నిర్మిస్తున్నారు. ఇలాంటి హోటళ్లు సుమారు 20,000కు పైగా ఉన్నాయని అంటున్నారు. అయితే... జపాన్ దేశంలో వ్యభిచారాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన తర్వాత వీటి సంస్కృతి మరింత పెరిగిందని అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా... వీటిలో వ్యభి*చారం ఎక్కువగా జరుగుతోందని.. అందుకే ఈ స్థాయిలో ఇవి పెరుగుతున్నాయని కొంతమంది అంటే... మరికొంతమంది మాత్రం ఈ ఆరోపణలను గట్టిగా ఖండిస్తున్నారు. అలా చేసే వారు 10% ఉంటే ఉండొచ్చు కానీ.. మిగిలిన 90%ని అలా చూడొద్దని.. ఇది ఏకాంతం కోసం చేసే ప్రయత్నమని అంటున్నారట.
ఈ హోటళ్లు ప్రైవసీ విషయంలో చాలా కేర్ తీసుకుంటాయని అంటున్నారు. ఇందులో భాగంగా... కాస్త చీకటిగా ఉండే కారు పార్కింగ్ ప్రాంతం నుంచి ఇక్కడ ప్రైవసీ మొదలవుతుందని చెబుతున్నారు. ఇక ఇక్కడున్న సిబ్బంది కూడా తెరలు, మసకమసగా ఉన్న గాజు డోర్స్ వెనుక నుంచే సేవలందిస్తారని చెబుతున్నారు.
జపాన్ వ్యాప్తంగా ఇలాంటి లవ్ హోటళ్లు సుమారు 20,000కు పైగా ఉన్నాయని అంటున్నారు. 1990 నుంచి అందుబాటులో ఉన్న ఘణాంకాల ప్రకారం ఏటా సుమారు 50 కోట్ల సార్లు ప్రేమ జంటలు వీటిని సందర్శిస్తుంటాయని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే... జపాన్ లో సగం శృం*గారం ఈ హోటల్స్ లోనే జరుగుతోందని అంటున్నారు.