అల్లు అర్జున్.. రెగ్యులర్ బెయిల్‌పై మళ్లీ టెన్షన్!
ఈ పిటిషన్‌పై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగింది. తాజాగా సోమవారం జరిగిన విచారణలోనూ తీర్పు రాలేదు.
By: Tupaki Desk | 30 Dec 2024 10:24 AM GMTఐకాన్ అల్లు అర్జున్.. వ్యవహారం మరోసారి కూడా టెన్షన్ పెట్టింది. పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సంద ర్భంగా ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు ఆయనకు జైలు విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనికి నాలుగు వారాల గడువు పెట్టింది. అయితే.. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చాలని నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగింది. తాజాగా సోమవారం జరిగిన విచారణలోనూ తీర్పు రాలేదు. తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి.. వచ్చే నెల 3న తుది తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో రెగ్యులర్ బెయిల్‌పై మళ్లీ టెన్షన్ కొనసాగుతోంది. తాజాగా సోమవారం నాటి విచారణలో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో నూ విచారణ జరుగుతోందని.. ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
అయితే.. అల్లు అర్జున్ పాత్రేమీ లేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని అల్లు తరఫున న్యాయవా దులు కోర్టుకు వివరించారు. మొత్తంగా పోలీసుల వాదనలు బలంగా వినిపించడం గమనార్హం. దీంతో సంధ్యా ధియేటర్ కేసులో ఇరుపక్షాల వాదనలు కూడా ముగిసిపోయాయి. తదుపరి తీర్పు వెల్లడించాల్సి ఉంది. అంటే.. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశంపై తీర్పు రావాలి. కానీ, ఇరు పక్షాల వాదనలు పూర్తయినందున వచ్చే నెల 3న తీర్పు వెల్లడించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొంటూ.. విచారణను మరోసారి వాయిదా వేశారు.
అనుకూలం కావొచ్చు: అల్లు న్యాయవాదులు..
తమకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వ్యాఖ్యా నించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించినా.. పోలీసులు చేసిన వాదనను పరిశీలించినా.. అర్జున్ తప్పు చేసినట్టు లేదని వారు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉన్న మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్‌గా మారే అవకాశం ఉందన్నారు. అయితే.. కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని.. ఎలాంటి తీర్పు వచ్చినా.. స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు.