కేసీఆర్‌కు షాక్.. కోర్టు నోటీసులు
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెస్తూనే ఉంది.
By: Tupaki Desk | 6 Sep 2024 5:23 AM GMTపదేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను ఏకఛత్రాధిపతిగా ఏలారు. ఆ పదేళ్లు ఆయన పార్టీ బీఆర్ఎస్‌కు కూడా తిరుగులేకుండా పోయింది. ఆయనకంటు పోటీ వచ్చే వారు కూడా లేకుండే. కానీ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా ట్రాక్ చేంజ్ అయింది.
దాంతో కేసీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. అదే సమయంలో ప్రత్యేక విచారణలు చేపిస్తోంది.
ఇదిలా ఉండగా.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. లక్ష ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంగా లక్ష కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టును కట్టారు అనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సరిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఆయనను దెబ్బేశాయి. లోపాల వల్ల ఆ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి.
దీంతో ఆ అంశం కాస్త కేసీఆర్‌కు చాలా వరకు వ్యతిరేకంగా మారిందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓటమికి సైతం కారణమైందని రాజకీయ వేత్తలు పలు సందర్భాల్లో చెప్పారు.
అయితే.. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వల్ల పెద్ద ఎత్తున ప్రజాధానం వృథా అయిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే కేసీఆర్‌తోపాటు మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.
ఆ సమయంలో కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్‌టి ఎండి సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరఫున న్యాయవాదులు మెమో ఆఫ్ అప్పీయరెన్స్ దాఖలు చేశారు. అయితే.. అవే నోటీసులు అందుకున్న కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు.
దీంతో కోర్టు మరోసారి ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసింనది. అక్టోబర్ 17న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ నోటీసులకైనా స్పందించి కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరవుతారా..? మరోసారి ఆ నోటీసులను లైట్ తీసుకుంటారా..? అనేది తెలియకుండా ఉంది.