Begin typing your search above and press return to search.

కేసీయార్ పైన కోర్టులో పిటీషన్!

ముఖ్యమంత్రితో పాటు మరో ఏడుగురిపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అందుకనే తాను కోర్టులో పిటీషన్ వేసినట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:30 PM GMT
కేసీయార్ పైన కోర్టులో పిటీషన్!
X

ఎన్నికల సమయంలో కేసీయార్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైందని ఆరోపిస్తూ నాగవెల్లి రాజ లింగమూర్తి భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీకి కేసీఆర్ తో పాటు మరో ఏడుగురు ప్రధాన కారణమని పిటిషన్లో ఆరోపించారు. తన పిటీషన్ను పరిశీలించి వెంటనే కేసీఆర్ తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాజలింగం కోర్టును కోరారు.

ముఖ్యమంత్రితో పాటు మరో ఏడుగురిపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అందుకనే తాను కోర్టులో పిటీషన్ వేసినట్లు చెప్పారు. కేసీయార్ వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం అవ్వటమే కాకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం డ్యామేజి అయ్యిందన్నారు. దీనివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశ్యం కూడా నీరుగారిపోతోందన్నారు. తన పిటీషన్లో రాజ లింగమూర్తి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి రిపోర్టును కూడా జతచేశారు.

తన పిటీషన్ను పరిశీలించి కేసీయార్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ జరిగేట్లుగా పోలీసు శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖలను ఆదేశించాలని పిటీషనర్ కోర్టును కోరారు. తన పిటీషన్లో కేసీయార్ తో పాటు జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్, కాంట్రాక్టు సంస్ధ ఎల్ అండ్ టి జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ పై అభియోగాలు మోపి కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయాలని పిటీషపర్ కోరారు

బ్యారేజీకి డ్యామేజి కావటం వల్ల బ్యారేజి నిర్మాణ ఉద్దేశ్యమే నీరుగారిపోయిందని రాజలింగమూర్తి ఆరోపించారు. మరమ్మత్తులు జరిగేంతవరకు బ్యారేజిలో నుండి నీటిని విడుదల చేసేందుకు లేదన్నారు. నీటి విడుదల జరగకపోతే పంటలకు నీళ్ళు ఎలాగ వస్తాయని ఆయన ప్రశ్నించారు. తన పిటీషన్ విషయంలో కోర్టు స్పందించకపోతే హైకోర్టులో పిటీషన్ వేస్తానని రాజలింగమూర్తి చెప్పారు. అవినీతిపరులకు శిక్షలు పడేంతవరకు న్యాయపోరాటం ఆపేదిలేదన్నారు