Begin typing your search above and press return to search.

విదేశాలకు వెళ్తారు.. కానీ స్వదేశంలో అక్కడికి మాత్రం రారు

ఇక ప్రధాని విదేశీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. స్వదేశంలో బీహార్,మణిపూర్ లాంటి ప్రదేశాలను ఆయన పర్యటించరు అని విమర్శించారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 3:04 PM GMT
విదేశాలకు వెళ్తారు.. కానీ స్వదేశంలో అక్కడికి మాత్రం రారు
X

ప్రధాని నరేంద్ర మోడీపై సిపిఐ నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ ఇజ్రాయిల్ మోడల్ ని ఫాలో అవుతున్నారని.. రేపులు చేసిన వాళ్లకు బెయిల్ ఇస్తున్నారని ఆరోపించారు. సాధువు పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడిన డేరా బాబాకు బెయిల్ ఇచ్చారని.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగిందని నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నో గోరాలకు పాల్పడిన డేరా బాబా లాంటి వారికి పంజాబ్, హర్యానాలో ఎన్నికల సమయం రావడంతో బెయిల్ ఇచ్చారు అని మండిపడ్డారు.

ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసు వివాదంలో నిందితుడైన డేరా బాబా అలియాజ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ సరిగ్గా హర్యానా ఎన్నికల సమయంలో బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే దీనిపై హర్యానా కాంగ్రెస్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు సరిగ్గా ఎన్నికల సమయంలో కావాలని గుర్మీత్ సింగ్ ను విడుదల చేశారని.. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అధిగమించినట్లు అవుతుందని ఈసీకి ప్రత్యేకంగా లేఖను కూడా రాశారు..

హర్యానాలో డేరా బాబా కి ఇప్పటికీ ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూరే విధంగా ప్రజలకు సంకేతాలను పంపుతారు. దీనివల్ల ఓటింగ్ ప్రభావితం అయ్యే ఛాన్స్ కూడా ఉంది అన్న విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావించిన సిపిఐ నారాయణ.. డేరా బాబా లాంటి వ్యక్తులకు బెల్లు వస్తాయి కానీ వరవరరావు లాంటి వారికి ఎప్పటికీ బెయిలు రావు అని వ్యాఖ్యానించారు.

బీజేపీ జమ్మూ కాశ్మీర్ లోదొడ్డిదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదు మంది ఎమ్మెల్యేలను ముందుగానే నామినేట్ చేశారని.. ఓట్ల లెక్కింపు సమయంలో సీట్లు గెలవడానికి ప్రభుత్వం నుంచి అన్ని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ప్రజల మద్దతు ఆ పార్టీతో ఉంటే వాళ్లు దొడ్డి దారిలో గెలవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నించారు.

ఇక ప్రధాని విదేశీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. స్వదేశంలో బీహార్,మణిపూర్ లాంటి ప్రదేశాలను ఆయన పర్యటించరు అని విమర్శించారు. బీహార్ లో వరదల కారణంగా జనం ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. మణిపూర్ ఇప్పటికే రావణకాష్టంలా కాలుతోందని పేర్కొన్న నారాయణ.. ఇటువంటి ప్రదేశాలకు మాత్రం ప్రధాని ఎందుకో రారు అంటూ విమర్శించారు.