Begin typing your search above and press return to search.

రెండుగా దేశం.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

సీనియర్ నేత నారాయణ ఇలా దేశం విడిపోతుందని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   11 March 2025 3:38 PM IST
రెండుగా దేశం.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
X

ప్రధాని మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన విమర్శలు చేశారు. పారిశ్రామిక వేత్త అదానీని కాపాడటం కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, అదానీపై ఉన్న శ్రద్ధ దేశంపై లేదంటూ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా ప్రధాని మోదీ మరో ఐదేళ్లు ఇదే విధంగా పాలిస్తే దేశం రెండుగా విడిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీనియర్ నేత నారాయణ ఇలా దేశం విడిపోతుందని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రధాని మోదీ విధానాలపై సీపీఐ తొలి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అయితే ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ సారి దేశం విడిపోతుందనే స్థాయిలో విమర్శలు చేయడమే కలకలం రేపుతోంది. అదానీ కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని నారాయణ చేసిన విమర్శలు దుమారాన్ని లేపాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని నాలుగు కీలక రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. జాతీయ విద్యావిధానంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆరోపిస్తున్నాయి. ఇక డిలిమిటేషన్ పై తెలంగాణ, కేరళలోనూ అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ సమస్యలే దేశాన్ని రెండుగా చీల్చుతాయని కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఇప్పుడు నారాయణ కూడా అంతే తీవ్రమైన విమర్శలు చేయడం హీట్ పుట్టిస్తోంది.

మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ పైనా సీపీఐ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి వెళ్లనంటూ జగన్ చేస్తున్న ప్రకటనపై స్పందిస్తూ.. అసెంబ్లీకి వెళ్లనంటే రాజీనామా చేయాలని సూచించారు. ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీ కమ్యూనిస్టులతో దోస్తీకి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటి సమయంలో వైసీపీ అధినేతను సైతం నారాయణ టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది.