ఒక సీటు-2 నామినేటు: చేతులు కలిపిన కాంగ్రెస్-సీపీఐ
ఈ పొత్తుల ఫలితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేయనుంది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కామ్రెడ్స్‌కు సహకరించాల్సి ఉంటుంది
By: Tupaki Desk | 7 Nov 2023 3:30 AM GMTఉంటుందో..ఉండదో.. కుదురుతుందో కుదరదో అంటూ.. అనేక మీమాంసలు.. తర్జన భర్జనల అనంతరం చిట్టచివరకు.. తుట్టతు దకు అన్నట్టుగా తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ-కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదిరింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి కూడా పొత్తులపై కమ్యూనిస్టులతో చర్చలకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. రోజులువారాలు గడుస్తున్నా.. నామినేష న్ల గడువు వచ్చేసినా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో విసుగు చెందిన సీపీఎం తన దారి తాను చూసుకుంది. ఇక, సీపీఐ కూడా తన మానాన తాను 17 మంది అభ్యర్థులతో జాబితా, వివిధ అంశాలతో మేనిఫెస్టో కూడా ప్రకటించింది.
కానీ, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ వంటి కీలక జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం, వారి ఓటు బ్యాంకు వంటివాటిని దృష్టిలో పెట్ఉటకున్న కాంగ్రెస్ కామ్రెడ్లతో కలిసి ముందుకు సాగాలనే నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎట్టకేలకు టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీపీఐతో చర్చలకు దిగారు. తాజాగా జరిగిన ఈ చర్చల్లో ఒక్క సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను కూడా సీపీఐకి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనికి సీపీఐ కామ్రెడ్స్ ఓకే చెప్పారు.
ఈ పొత్తుల ఫలితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేయనుంది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కామ్రెడ్స్‌కు సహకరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీచేస్తుందని.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే.. ఇక్కడ పెద్ద సమస్య స్థానిక నేతలతోనే కనిపిస్తోంది. సీపీఐతో పొత్తుకు చివరి నిమిషంలో అధిష్టానం ఓకే అన్నా.. నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారన్నదే కీలకం.